ఫ్యాక్ట్ చెక్: భారత వైమానిక స్థావరం ధ్వంసమైందంటూ పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఎడిటెడ్ ఆజ్తక్ వీడియో
సరిహద్దు వెంబడి నాలుగు రోజుల పాటు జరిగిన డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత, తక్షణమే అన్ని సైనిక చర్యలను నిలిపివేయాలని భారతదేశ

Claim :
భారత వైమానిక స్థావరం ధ్వంసమైందని, భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని మీడియా సంస్థ ఆజ్తక్ నివేదించినట్లు వైరల్ వీడియో చూపిస్తోందిFact :
వైరల్ అవుతున్న వీడియోను ఎడిట్ చేశారు. అసలైన నివేదికలో పాకిస్తాన్ ప్రభుత్వం గురించి ప్రస్తావించారు
సరిహద్దు వెంబడి నాలుగు రోజుల పాటు జరిగిన డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత, తక్షణమే అన్ని సైనిక చర్యలను నిలిపివేయాలని భారతదేశం, పాకిస్తాన్ మే 10, 2025న అంగీకరించాయి. భారతదేశం, పాకిస్తాన్ మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయి చర్చలు మే 12, 2025 తర్వాత జరగనున్నాయి. ఈ కాల్పుల విరమణ తర్వాత కూడా, పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని కొనసాగిస్తోంది, అధికారిక ఛానెల్లు, సోషల్ మీడియా రెండింటినీ ఉపయోగించి భారతదేశంలో అశాంతిని రెచ్చగొట్టడానికి, పలు సంఘటనలకు సంబంధించి తప్పుడు నివేదికలను వ్యాప్తి చేస్తోంది. భారతీయ పౌరులలో భయాందోళనలకు, అంతర్జాతీయ సమాజంలో గందరగోళానికి ఇలాంటి పోస్టులు కారణమవుతున్నాయి. గుజరాత్, ఉరి, నగ్రోటా, రాజౌరిలోని భారత స్థావరాల ధ్వంసం గురించి పాకిస్తాన్లోని పలు ఖాతాలు ప్రచారం చేస్తున్నాయి. అదేవిధంగా, అఖ్నూర్, భటిండా వైమానిక స్థావరాలను నాశనం చేసినట్లు PTV అనే వార్తా ఛానెల్ తెలిపింది. ఈ వాదనలన్నింటినీ భారత ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తోసిపుచ్చాయి.
ఫ్యాక్ట్ చెక్:
భారత వైమానిక స్థావరం ధ్వంసమైందని, భారత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని భారత మీడియా సంస్థ ఆజ్తక్ నివేదించిందనే వాదన నిజం కాదు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి పాకిస్తాన్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అసలు వార్తా నివేదిక వీడియోను ఎడిట్ చేసి షేర్ చేశారు.