ఫ్యాక్ట్ చెక్: ఏఐ జెనరేటెడ్ వీడియోను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల పచ్చని ప్రాంతాన్ని వేలం వేయాలనే ప్రణాళికపై తెలంగాణలోని కాంగ్రెస్

Claim :
వైరల్ వీడియో తెలంగాణ ప్రభుత్వం కారణంగా హెచ్ సీ యూ సమీపంలోని భూములలో జరిగిన విధ్వంసం చూపుతోందిFact :
ఇది AI జనరేటెడ్ వీడియో. ఇందులో ఉన్నవి HCUలో జరిగిన నిజమైన సంఘటనలు కాదు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల పచ్చని ప్రాంతాన్ని వేలం వేయాలనే ప్రణాళికపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలువురు తమ వాయిస్ ను వినిపించారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పర్యావరణ ప్రేమికుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నిరసనల సందర్భంగా చాలా మంది విద్యార్థులను అరెస్టు చేశారు. పలు కేసులు నమోదయ్యాయి. భూమి వేలానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు.
ఫ్యాక్ట్ చెక్
AI డిటెక్షన్ టూల్ ఉపయోగించి ఎక్స్ట్రాక్ట్ చేసిన కీఫ్రేమ్లను మేము తనిఖీ చేసినప్పుడు అన్ని కీఫ్రేమ్లు AI ద్వారా రూపొందించినవిగా కనుగొన్నాము. ఫలితాల స్క్రీన్షాట్లు ఇక్కడ ఉన్నాయి.
కాబట్టి, వైరల్ వీడియో AI జనరేటెడ్ వీడియో, నిజమైన విజువల్స్ ను చూపించదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.