Sun Mar 22 2026 07:40:19 GMT+0530 (India Standard Time)
ఫ్యాక్ట్ చెక్: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తలపై దాడుల వీడియో అంటూ.. తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ వీడియో షేర్ చేశారు
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తలపై దాడుల వీడియో అంటూ.. తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ వీడియో షేర్....

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కార్యకర్తలపై దాడులు చోటు చేసుకున్నాయా
ఫాక్ట్: వైరల్ అవుతున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్ కు చెందినది కాదు.. తెలంగాణ రాష్ట్రానికి చెందినది
రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు రోడ్డుపై కొట్టుకుంటూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఓ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలా జరిగిందని.. కొంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పట్టపగలు దాడికి పాల్పడినట్లు చెబుతూ క్లిప్‌ను చాలా మంది షేర్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలను బీజేపీ నేతలు కొడుతున్నారని చెబుతూ పోస్టులను షేర్ చేస్తూ ఉన్నారు.
వైరల్ వీడియో తెలంగాణకు చెందినదని, ఉత్తరప్రదేశ్‌కు చెందినది కాదని తెలుగు పోస్ట్ టీమ్ గుర్తించింది. ఫిబ్రవరి 14న ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ ఓటింగ్ ప్రారంభం కాగా, ఈ నేపథ్యంలో వీడియో వైరల్‌గా మారింది. 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో బీజేపీ జెండా కండువాలు ధరించిన వ్యక్తులను రోడ్డు మధ్యలో కొందరు వ్యక్తులు వెంబడించి కొట్టారు. నిందితులు గులాబీ కండువాలు ధరించి, గులాబీ జెండాలు పట్టుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హిందీ క్యాప్షన్లతో వైరల్ అవుతూ.. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినది అని ప్రచారం అవుతూ వచ్చింది.
"विधायकों के पीटने की अपार सफलता के बाद, पार्ट 2 में कार्यकर्ताओं का नंबर आया, अब वक्त है बदलाव का। #UPElection2022 #Election2022" అంటూ హిందీలో పోస్టులను వైరల్ చేయడం మొదలు పెట్టారు.
నిజ నిర్ధారణ:
వీడియోలోని జెండాలను బట్టి.. టీఆర్ఎస్-బీజేపీ వర్గాలకు సంబంధించిన గొడవ ఇదని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఆ కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా ఇది తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుందని పలు వీడియోల లింక్స్.. మీడియా సంస్థలకు సంబంధించిన రిపోర్టులు మాకు లభించాయి.https://www.thehindu.com/news/
https://www.newindianexpress.
https://telanganatoday.com/
ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లాకు చెందినది. అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడుతున్నట్లు వీడియోలో ఉంది. ఈ ఘటనకు యూపీలో జరుగుతున్న ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు.
కొద్దిరోజుల కిందట పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ జనగాం క్రాస్‌రోడ్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సమయంలోనే ఈ గొడవ చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. జనగాం క్రాస్‌రోడ్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
వైరల్ వీడియోను కొన్ని చోట్ల మీరు నిశితంగా గమనిస్తే జనగాం అనే పదాలను గుర్తించవచ్చు. జనగాం ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన హోర్డింగ్స్ అందులో ఉన్నాయి. జనగాం తెలంగాణలోని జిల్లా హైదరాబాద్ నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. బీజేపీ కార్యకర్తలను వెంటాడుతున్న వ్యక్తులు గులాబీ శాలువాలు ధరించి ఉండడాన్ని గమనించవచ్చు. అదే వీడియో చివరలో తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ఫోటో, పేరుతో కూడిన భారీ బిల్‌బోర్డ్‌ను గుర్తించాము.
ఈ వీడియోలకు సంబంధించి తెలుగు మీడియా సంస్థల్లో టెలికాస్ట్ అయిన వార్తలు ఇక్కడ చూడవచ్చు.
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలను ఉత్తరప్రదేశ్ కు లింక్ చేసి పోస్టు చేస్తున్నారు.
క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ కార్యకర్తలను నడిరోడ్డుపై కొట్టారు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టులు అబద్ధం
Claim : After the huge success of MLAs being thrashed, now is the turn of party workers. This is the time of change #UPElection2022 #Election2022
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story

