Fri Dec 05 2025 05:25:18 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: మద్యం మత్తులో వ్యక్తి పులికి మద్యం తాగిస్తున్నట్టు చూపిస్తున్న వైరల్ విడియో నిజమైంది కాదు, ఏఐ తో చేసింది
Viral video of a drunk man petting a tiger in Pench Tiger Reserve is AI-generated. Forest officials confirm it’s fake CCTV footage.

Claim :
పెంచ్ టైగర్ రిజర్వ్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పులికి మద్యం తాగించడం CCTV లో రికార్డు అయిందిFact :
వైరల్ వీడియో AI జనరేటెడ్ వీడియో, ఇది నిజమైన CCTV ఫుటేజ్ కాదు.
భారతదేశంలో మద్యం వినియోగం పెరుగుతోంది, దీని వలన కాలేయ, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాకుండా ఊహించని ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంది. మద్యం మత్తులో హింసకు పాల్పడే అవకాశం కూడా ఉంది. ఆల్కహాల్ లివర్ సిర్రోసిస్‌కు ప్రధాన కారణం, ఫ్యాటీ లివర్ వంటి వాటిని మరింత దిగజార్చవచ్చు. అధికంగా తాగడం అధిక రక్తపోటు, కొరోనరీ హార్ట్ డిసీజ్, ఇస్కీమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్‌తో ముడిపడి ఉంది. మద్యం వాడకం వివిధ క్యాన్సర్లకు ముఖ్యమైన ప్రమాద కారకం.
రోడ్డు ప్రమాదాలు, ప్రవర్తనలో మార్పు, హింసకు పలు సందర్భాల్లో మద్యం కారణమవుతుంది. మద్యం అతిగా తాగడం వలన ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, ఇతర కారణాల వలన ఆర్థిక భారానికి కారణమవుతుంది. మద్యం వినియోగం ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. పిల్లలతో సహా కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేస్తుంది.
X లోని పోస్ట్‌లతో సహా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. 52 ఏళ్ల కార్మికుడు, బాగా మద్యం మత్తులో ఉన్నప్పుడు, టైగర్ రిజర్వ్‌లోకి ప్రవేశించి పులిని పిల్లిగా భావించి, దాని తలపై నిమిరి తన మద్యం బాటిల్‌ను ఇచ్చాడని చెబుతూ ఉన్నారు. ఈ మొత్తం సంఘటన CCTVలో రికార్డ్ అయిందని ఆరోపిస్తూ ఉన్నారు. మరికొందరేమో బెంగాల్ లో చోటు చేసుకున్న ఘటన అంటూ చెబుతున్నారు
"తాగిన మైకంలో పెద్ద పులిని పిల్లి అనుకొని బుజ్జగించిన మద్యం ప్రియుడు.. కాసేపు అనంతరం తిరిగి అడవిలో వెళ్ళిపోయిన పెద్ద పులి.. బెంగాల్ లో ఘటన.. వీడియో వైరల్" అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.
అక్టోబర్ 4, 2025న, భారతదేశంలోని పెంచ్‌లో, CCTVలో ఒక ఆసక్తికర క్షణం రికార్డయింది. 52 ఏళ్ల కూలీ రాజు పటేల్, అర్థరాత్రి పులిని పిల్లిలా భావించాడు. మద్యం తాగి ఉన్న సమయంలో సమీపంలోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుండి వచ్చిన ఒక చిన్న బెంగాల్ పులిని వీధిలో పలకరించాడు..
150-200 కిలోల బరువున్న ఆ జంతువు గంటల తరబడి వీధుల్లో తిరుగుతుండగా గ్రామస్తులు భయాందోళనకు గురై తలుపులు లాక్ చేసుకున్నారు. రాజు దగ్గరకు పులి రాగా, "పిల్లి పక్కకు వెళ్ళు" అని గొణుగుతూ, దాని తలను సున్నితంగా తాకాడు. అటవీ అధికారులు స్పాట్లైట్లు, ట్రాంక్విలైజర్లతో వచ్చారు, అలసిపోయిన పులిని తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి అడవుల్లోకి పంపించారు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. ఇది వీరోచిత పోరాటం కాదు, మానవ-పులుల ఘర్షణలు పెరుగుతున్న ప్రాంతంలో ఒక వింతైన ఘటన. 2025-10-04 10:00 టైమ్‌స్టాంప్ సమయంలో ఈ చిత్రం వైరల్ అయ్యింది." అని మరికొందరు ఈ ఘటన గురించి ప్రస్తావించారు.
వైరల్ వీడియో స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. వైరల్ వీడియోను AI ద్వారా సృష్టించారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్, అధికారిక ప్రకటనల విశ్లేషణతో కూడిన మా ధృవీకరణ ప్రక్రియలో, ఈ వింత సంఘటనకు మద్దతు ఇచ్చే ఏ వార్తా సంస్థ లేదా అటవీ శాఖ అధికారి నుండి విశ్వసనీయ నివేదికలు కనుగొనలేదు.
ఇది కేవలం 6 సెకన్లు మాత్రమే ఉంది, చాలా AI వీడియో జనరేటర్లు వీడియోను ఉత్పత్తి చేసే డిఫాల్ట్ సమయ వ్యవధి. వెలుగులో కనిపించే ప్రతిబింబాల విషయంలో చాలా తేడాలను మనం గమనించవచ్చు. నిజమైన CCTV ఫుటేజ్ సాధారణంగా శబ్దం, అసమాన లైటింగ్ కలిగి ఉంటుంది.
మరింత వెతికినప్పుడు, భాస్కర్ ఇంగ్లీష్‌లో ప్రచురితమైన ఒక నివేదికను మేము కనుగొన్నాము, దీనిలో ఒక వ్యక్తి పులి తలపై కొట్టి దానికి మద్యం అందిస్తున్నట్లు చూపించే వీడియోను అటవీ అధికారులు నకిలీదిగా ప్రకటించారు. నివేదిక ప్రకారం, పెంచ్ టైగర్ రిజర్వ్ పక్కనే ఉన్న ఒక గ్రామానికి చెందిన రాజు పటేల్ (52) తాగిన మత్తులో పులిని పిల్లిగా తప్పుగా భావించాడని వీడియో పేర్కొంది. రాజు పులి తలపై నిమరడమే కాకుండా మద్యం కూడా ఇచ్చాడని వీడియో చూపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పలువురిని ఆకర్షించడం ప్రారంభించింది.
అయితే, పెంచ్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ రజనీష్ కుమార్ సింగ్ ఈ వీడియోను నకిలీదిగా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి కార్యకలాపాలను అటవీ శాఖ చాలా ప్రమాదకరమైనదిగా అభివర్ణించింది. ముఖ్యంగా పెంచ్ ప్రాంతంలో ఇటీవల మానవ-పులి సంఘర్షణకు సంబంధించిన అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. వైరల్ వీడియోలో నిజం లేదని డిప్యూటీ డైరెక్టర్ రజనీష్ కుమార్ సింగ్ అన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని పిలుపునిచ్చారు.
డీప్‌ఫేక్ డిటెక్షన్ టూల్, హైవ్ మోడరేషన్ ఉపయోగించి చేసిన విశ్లేషణలో, వీడియో కీఫ్రేమ్‌లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించబడినట్లు నిర్ధారించారు. ఇక్కడ స్క్రీన్‌షాట్ ఉంది.
కనుక, మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పులికి మద్యం తాగిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజమైన సంఘటన కాదు, AI డీప్‌ఫేక్. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : పెంచ్ టైగర్ రిజర్వ్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పులికి మద్యం తాగించడం CCTV లో రికార్డు అయింది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story

