ఫ్యాక్ట్ చెక్: iBomma పోలీసులకు హెచ్చరిక జారీ చేసిందంటూ రెండు సంవత్సరాలు పాత చిత్రం వైరల్ అవుతోంది
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2025 ఆగస్టు చివరిలో iBomma వెబ్సైట్ తో సహా మరో 64 మిర్రర్ వెబ్సైట్లపై కేసు నమోదు

Claim :
హైదరాబాదు పోలీస్ అధికారులను లక్ష్యంగా చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని పైరసీ వెబ్సైట్ iBomma ఇటీవల హెచ్చరిక జారీ చేసిందని ఒక వైరల్ చిత్రం చూపిస్తోందిFact :
ఈ claim తప్పు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఆ చిత్రం రెండు సంవత్సరాల పాతది.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2025 ఆగస్టు చివరిలో iBomma వెబ్సైట్ తో సహా మరో 64 మిర్రర్ వెబ్సైట్లపై కేసు నమోదు చేశారు. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. ఈ వెబ్సైట్లు కొత్త సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే హై-డెఫినిషన్ పైరసీ కాపీలను అప్లోడ్ చేస్తున్నాయని, దాంతో భారీ ఆర్థిక నష్టాలు కలుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
iBomma, ఇతర ఇలాంటి వెబ్సైట్లు తీసివేయడం కష్టం. ఎందుకంటే ఇవి Cloudflare వంటి కంటెంట్ డెలివరీ నెట్‌వర్క్స్‌లో హోస్ట్ అవుతాయి. దీని వల్ల అసలు సర్వర్లు దాచి, నిర్వాహకులకు సులువు గా తమ గుర్తింపు ను దాచగలుగుతున్నారు, అని అధికారులు తెలియజేసారు. ఈ నిర్వాహకులు కొత్త మిర్రర్ సైట్లు సృష్టించడం, పేర్లు, URLలను తరచుగా మార్చడం ద్వారా తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల ఈ వెబ్సైట్ తన పేరును "Bappam"గా మార్చిందని కూడా అధికారులు గమనించారు.
ఐతే, టెక్స్ట్ ఉన్న ఒక చిత్రం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అందులో ‘iBomma’ వెబ్సైట్ పోలీసులు రెచ్చగొడితే తీవ్రమైన ప్రతిస్పందన ఇస్తామని హెచ్చరిక జారీ చేసిందని క్లెయిమ్ చేస్తున్నారు.
- హీరోలకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినాఈ మిడిల్ లో వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం. ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం.
- సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు. వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.
- సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.
- అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు.. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.ఇబొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాల్లం కాదు. బురదలో రాయి వేయకండి... అది కూడా పెంట మీద అసలు వేయకండి.మేము ఏ దేశం లో వున్నా భారత దేశం. అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము.(చావుకు భయపడని వాడు దేనికి భయపడడు There's nothing more dangerous than a man who has nothing to loose.).”
ఫ్యాక్ట్ చెక్:
ఈ క్లెయిమ్ లో నిజం లేదు. ఇటీవల iBomma ఇలాంటి స్టేట్మెంట్ విడుదల చేయలేదు. రెండు సంవత్సరాల క్రితం iBomma తెలుగు సినీ పరిశ్రమను హెచ్చరిం చింది అంటూ వైరల్ అయిన ఓపెన్ లెటర్ ఇప్పుడు పోలిసులను హెచ్చరించింది అంటూ వైరల్ అవుతోంది.
ఈ ఇమేజ్ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 2023 సెప్టెంబర్ లో పంచబడిన సోషల్ మీడియా పోస్టులు దొరికాయి. వాటిలో iBomma వెబ్సైట్ తెలుగు సినీ పరిశ్రమకు హెచ్చరిక జారీ చేసిందని పేర్కొందంటూ షేర్ చేసారు.
2023 సెప్టెంబర్ 8న ABP తెలుగు ప్రచురించిన ఒక ఆర్టికల్‌లో, OTT కంటెంట్ పైరసీ చేసే ‘iBomma’ వెబ్సైట్ సినీ పరిశ్రమ మొత్తాన్ని హెచ్చరించిందని పేర్కొంది. “మీరు మమ్మల్ని ఫోకస్ చేస్తే, మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం” అని ఓపెన్ లెటర్ రిలీజ్ చేసిందని నివేదించింది.
iBomma వెబ్సైట్, వారి సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని శోధించాం. కానీ వారు తాజాగా ఇలాంటి స్టేట్మెంట్ చేసినట్టు ఎక్కడా లేదు. అలాగే, ఈ ఓపెన్ లెటర్ నిజంగా iBomma జారీ చేసిందా అనే విషయాన్ని కూడా నిర్ధారించలేకపోయాం. అయితే వైరల్ అవుతున్న ఇమేజ్ రెండు సంవత్సరాల నాటిది, తాజాగా చేసింది కాదు.
కనుక, రెండు సంవత్సరాల క్రితం ఇంటర్నెట్లో ఉన్న ఓపెన్ స్టేట్మెంట్ను సోషల్ మీడియా యూజర్లు మరియు కొన్ని ప్రధాన మీడియా సంస్థలు కూడా షేర్ చేస్తూ, OTT పైరసీ వెబ్సైట్ iBomma పోలీసులు బెదిరించిందని తప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ వాదన నిజం కాదు.

