ఫ్యాక్ట్ చెక్: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకీ, బీజేపీ పార్టీ కి సంబంధం లేదు, ఇది ఏఐ చిత్రం
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో భారతీయ ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అయ్యారు. సోషల్ మీడియా

Claim :
జ్యోతి మల్హోత్రా బీజేపీ టోపీ ధరించి నేషనల్ మీడియాలో కనిపించింది. ఆమెకు బీజేపీతో సంబంధం ఉందని రుజువు చేస్తుంది.Fact :
వైరల్ అవుతున్న చిత్రం నిజమైనది కాదు. ఇది AI- జనరేటెడ్ చిత్రం.
పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో భారతీయ ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అయ్యారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ISI ఉపయోగించుకుంటూ ఉందని తెలుస్తోంది. జ్యోతి మల్హోత్రా ‘ట్రావెల్ విత్ జో’ అనే ట్రావెల్ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. ఆమెకు 3.2 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో బాగా ఫాలోవర్లు ఉన్నారు.
జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె గడుపుతున్న విలాసవంతమైన జీవితం, తరచూ సాగించిన పాకిస్థాన్ పర్యటనలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. ఆమె ఆదాయ వనరులకు, ఖరీదైన జీవనశైలికి పొంతన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విమాన ప్రయాణాల్లో సైతం ఫస్ట్ క్లాస్‌లోనే ప్రయాణించినట్లు సమాచారం. ఖరీదైన హోటళ్లలో బస చేయడం, ప్రముఖ రెస్టారెంట్లలోనే భోజనం చేయడం వంటివి ఆమె జీవనశైలిలో భాగంగా మారాయి. జ్యోతి పాకిస్థాన్ పర్యటన ఖర్చులన్నీ స్పాన్సర్లే భరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పాక్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఆమె చైనాకు కూడా వెళ్లినట్లు తేలింది. అక్కడ కూడా విలాసవంతమైన కార్లలో తిరగడం, ఖరీదైన నగల దుకాణాలను సందర్శించడం వంటివి చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఆమెతో పాటు, 12 మందిని భారత పోలీసులు గూఢచర్యం చేస్తున్నారని, పాకిస్తాన్ కు సున్నితమైన సైనిక సమాచారాన్ని అందిస్తున్నారనే అనుమానంతో అరెస్టు చేశారు.

