వారి వాయిస్ ను కట్టేసిందెవరు..?
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పార్టీకి నలుగురు మహిళా ఎంపీలు ఉండడం వైసీపీకే సాధ్యమైంది. గతంలో కాంగ్రెస్ తరపున చూసుకున్నా.. ముగ్గురుకు మించి మహిళా [more]
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పార్టీకి నలుగురు మహిళా ఎంపీలు ఉండడం వైసీపీకే సాధ్యమైంది. గతంలో కాంగ్రెస్ తరపున చూసుకున్నా.. ముగ్గురుకు మించి మహిళా [more]

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పార్టీకి నలుగురు మహిళా ఎంపీలు ఉండడం వైసీపీకే సాధ్యమైంది. గతంలో కాంగ్రెస్ తరపున చూసుకున్నా.. ముగ్గురుకు మించి మహిళా ఎంపీలు ఉన్న చరిత్ర లేదు. అయితే, ఎందరు ఉన్నా కాంగ్రెస్ తరఫున గట్టి గళం వినిపించడంలో వారంతా ముందుండే వారు. పురందేశ్వరి, పనబాక లక్ష్మిలు కేంద్రంలో మంత్రులుగా కూడా చక్రం తిప్పారు. అదే సమయంలో వారు పార్టీ తరఫున మంచి గళం వినిపించారు. ఇక, ఖమ్మం నుంచి గెలిచిన రేణుకా చౌదరి ఏకంగా ఫైర్ బ్రాండ్ నేమ్ సొంతం చేసుకున్నారు. ఇక, గత ఎన్నికల్లో అంటే 2014లో వైసీపీ తరపున గెలిచిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత తన కాంట్రవర్సీ వ్యాఖ్యలతో మీడియాలో నిలిచేవారు.
నలుగురు ఎంపీలున్నా….
అయితే, ఆమె పార్టీలు మారడం, రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆమె ప్రజల సమస్యలను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే ఇప్పుడు వైసీపీ తరఫున ఏకంగా నలుగురు మహిళా ఎంపీలు ఉన్నారు. అమలాపురం నుంచి చింతా అనురాధ, అనకాపల్లి డాక్టర్ సత్యవతి, అరకు నుంచి గొట్టేటి మాధవి, కాకినాడ నుంచి వంగా గీతలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయం సాధించారు. అయితే, వీరు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. పోనీ.. పార్లమెంటు సమావేశాల్లో అయినా ఏపీ తరఫున బలమైన గళం వినిపిస్తున్నారా? అంటే అదికూడా కనిపించడం లేదు.
సమస్యలపై స్పందన లేకుండా….
దీంతో ఈ నలుగురు మహిళా ఎంపీలు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న చర్చకు వస్తోంది. వాస్తవానికి ఎన్ని సమస్యలు ఉన్నా.. ఏ సమయంలోనైనా.. ఏపీకి ప్రత్యేక హోదానే ప్రధానమని సాక్షాత్తూ జగన్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీలకు హితవు పలికారు. దీనిని వారంతా అంగీకరించారు. అయినా కూడా ఈ నలుగురు మాత్రం ఏ సమస్యపైనా ఎక్కడా గళం వినిపిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. మరి దీనికి కారణాలు ఏంటనే విషయం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం వైసీపీ పార్లమెంటు ఎంపీలకు విజయసాయిరెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన కనుసన్నల్లోనే అంతా సాగుతోంది.
ఎందుకు మౌనంగా….
ఈ నేపథ్యంలో ఆయన సూచనలే పనిచేస్తున్నాయా? అందుకే వీరంతా మౌనంగా ఉన్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే. .అసెంబ్లీలో వైసీపీకి 23 మంది ఉన్న మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా బలమైన గళం వినిపిస్తూ దూసుకుపోతున్నారు. జొన్నలగడ్డ పద్మావతి, విడదల రజనీ, ఉండవల్లి శ్రీదేవితో పాటు మంత్రులు మేకతోటి సుచరిత స్పీడ్‌గా ఉంటున్నారు. ఇక్కడ మహిళా ఎమ్మెల్యేలు స్పీడ్‌గా ఉన్నా అదే రేంజ్లో ఏకంగా లోక్‌సభలో నలుగురు లేడీ ఎంపీలు ఉన్నా వారు నోరు మెదపకపోవడం విచిత్రమే.