వాళ్లు వచ్చి పార్టీలో చేరినా…?
ఒక్క ఆనం రామనారాయణ రెడ్డి మాత్రమే కాదు, ఆమంచి కృష్ణమోహన్ నుంచి తోట త్రిమూర్తులు వరకు అందరూ స్వప్రయోజనాలు ఆశించే వైసీపీలో చేరారు. వీరితో పార్టీకి ఎలాంటి [more]
ఒక్క ఆనం రామనారాయణ రెడ్డి మాత్రమే కాదు, ఆమంచి కృష్ణమోహన్ నుంచి తోట త్రిమూర్తులు వరకు అందరూ స్వప్రయోజనాలు ఆశించే వైసీపీలో చేరారు. వీరితో పార్టీకి ఎలాంటి [more]

ఒక్క ఆనం రామనారాయణ రెడ్డి మాత్రమే కాదు, ఆమంచి కృష్ణమోహన్ నుంచి తోట త్రిమూర్తులు వరకు అందరూ స్వప్రయోజనాలు ఆశించే వైసీపీలో చేరారు. వీరితో పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదనేది వాస్తవం అంటున్నారు వైసీపీ నేతలు. విషయంలోకి వెళ్తే.. ఈ ఏడాది ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత వైసీపీ పరిస్థితి భిన్నంగా ఉంది. ఎన్నికలకు ముందు వరకు అంటే గడిచిన ఐదేళ్లపాటు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. జగన్పై అనేక రూపాల్లో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న టీడీపీ, దానికి అనుకూలంగా వ్యవహరించిన పవన్ కూడా విపక్ష నేత జగన్పై విమర్శలు గుప్పించారు.
ఎన్నికలకు ముందు చేరి….
ఆ సమయంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులు కొందరు మాత్రమే ఉన్నారు. రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, విజయసాయి రెడ్డి ఇలా కొందరు మాత్రమే వైసీపీకి అండగా నిలిచారు. ఇక, ఎన్నికలకు కొన్ని నెలల ముందు టీడీపీలో అవకాశం లేక, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు ప్రజామోదం లేక చాలా మంది నాయకులు పార్టీలు మారి వైసీపీ గూటికి చేరుకున్నారు. ఇలా వచ్చిన వారిలో ఆనం, ఆమంచి, తోట నరసింహం, వాణి వంటి వారు ఉన్నారు. అయితే, వీరికి జగన్ పెద్దపీటే వేశారు. అప్పటి వరకు ఉన్న నాయకులను కూడా తప్పించి వీరికి టికెట్లు ఇచ్చి గెలిపించుకునే ప్రయత్నం చేశారు.
వచ్చి చేరిన వెంటనే…..
అయితే, ఇలా వచ్చిన వారు వైసీపీలో వెంటనే గుర్తింపు కోరుకోవడం, ప్రభుత్వంలో పదవులు ఆశించడమే ఇప్పుడు వివాదానికి కారణం అవుతోంది. మంత్రి పదవి ఆశించిన ఆనం అది దక్కక పోవడంతో ఇప్పుడు వైసీపీపై ఫైర్ అవుతున్నారు. ఇక, తోట వాణి పార్టీ మారేందుకు చూస్తున్నారు. మరికొందరు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది నిజం. ఆమంచి ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఓడిపోయాక ఇప్పుడు నామినేటెడ్ పదవి కావాలని నానా హంగామా చేస్తున్నారు. కానీ, వాస్తవానికి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వీరు చేసిన కృషి ఏమైనా ఉందా? గడిచిన ఐదేళ్లలో పార్టీని నిలబెట్టేందుకు వీరు ఏమైనా సహకరించారా? అంటే ప్రశ్నలే మిగులుతున్నాయి. మరి అలాంటి నాయకులకు పార్టీని విమర్శించే అర్హత ఎక్కడ ఉంటుంది? అనేది ఇప్పుడు వైసీపీ సీనియర్లు ప్రశ్నిస్తున్న విషయం.
తమను గుర్తిస్తారని…..
అదే సమయంలో పార్టీలో ఎప్పటి నుంచో ఉండి. జగన్ కష్టాలను దగ్గరగా చూసి, ఆయనకు అండగా నిలు చున్న వారు వందల సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారిలో కొందరికి మాత్రమే పదవులు లభించాయి. వీరిలోనూ అసంతృప్తి ఉంది. అయినంత మాత్రంతో.. జగన్పై విమర్శలు సంధించడం లేదే., పరిస్తితిని గమ స్తున్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. జగన్ తమకు న్యాయం చేస్తారనే ధీమాతో కొనసాగుతున్నారు. పార్టీని మరింత బలోపేతం చేయాలని చూస్తున్నారు. అంతే తప్ప.. పదవుల కోసం పార్టీలు మారిన నేతల మాదిరిగా పాతకాపులు రాళ్లు రువ్వడం లేదనేది వాస్తవం అంటున్నారు వైసీపీ సీనియర్లు. మరి ఇప్పటికైనా..జంప్ జిలానీలు ఈ విషయం తెలుసుకుంటారో లేదో ? చూడాలి.
