జనసేన జబ్బలు చరస్తున్నా….వైసీపీ మాత్రం?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే ప్రారంభించారు. ఆయన సమైక్య రాష్ట్రంగా ఉండాలని చివరి వరకూ నినదించారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే ప్రారంభించారు. ఆయన సమైక్య రాష్ట్రంగా ఉండాలని చివరి వరకూ నినదించారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే ప్రారంభించారు. ఆయన సమైక్య రాష్ట్రంగా ఉండాలని చివరి వరకూ నినదించారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో వైసీపీని ఏపీకే పరిమితం చేశారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసిన వైసీపీ పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకుంది. అయినా తెలంగాణ రాజకీయాలపై రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ అధినేత జగన్ అంత సుముఖంగా లేరు.
ఆ తర్వాత ఏ ఎన్నికల్లో……
దీంతో 2014 తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ జగన్ తెలంగాణలో పోటీకి సుముఖత వ్యక్తం చేయలేదు. ఏపీలో తన ప్రత్యర్థి పార్టీ టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తున్నప్పటికీ వైసీపీని మాత్రం జగన్ ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం చేశారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలో మరోసారి వైసీపీ విషయం చర్చకు వచ్చింది. వైసీపీ తెలంగాణ నేతలు గ్రేటర్ హైదరాబద్ బరిలో దిగాలని పార్టీ హైకమాండ్ తో సంప్రదింపులు జరిపారు.
నో చెప్పిన జగన్…..
అయితే జగన్ మాత్రం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. తొలుత పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయాలని మాత్రమే నేతలకు సూచించినట్లు తెలిసింది. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో పాటు జనసేన కూడా బరిలోకి దిగుతుంది. జనసేన కన్నా తెలంగాణలో వైసీపీకే ఎక్కువ బలం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఇప్పటికీ అభిమానించే వాళ్లు ఇక్కడ ఉన్నారు.
మరింత దూరం పెరగకూడదనే….
అయినా జగన్ మాత్రం ఎన్నికల్లో పోటీకి నో చెప్పేశారు. దీనికి ప్రధాన కారణం కేసీఆర్ తో సంబంధాలు చెడిపోతాయనే అంటున్నారు. ఇప్పటికే పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, జగన్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తే మరింత దూరం పెరిగే అవకాశముందని జగన్ భావించారు. దీంతో పాటు ఇప్పుడు తెలంగాణ రాజీకీయాలు తనకు అవసరం లేదని జగన్ భావించడమూ పోటీకి దూరంగా ఉండటానికి కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద జనసేనకు ఉన్న ధైర్యం వైసీపీకి లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

