జగన్…ఇలా అయితే…ఎలా…??
వైసీపీ అధినేత జగన్కు అనుభవం తక్కువ! అన్న మాటలు నిజం అవుతున్నాయి. ఆయన సానుభూతి పరులు సైతం నిన్న మొన్నటి వరకు ఇలాంటి వ్యాఖ్యలను తిప్పికొట్టినా.. తాజాగా [more]
వైసీపీ అధినేత జగన్కు అనుభవం తక్కువ! అన్న మాటలు నిజం అవుతున్నాయి. ఆయన సానుభూతి పరులు సైతం నిన్న మొన్నటి వరకు ఇలాంటి వ్యాఖ్యలను తిప్పికొట్టినా.. తాజాగా [more]

వైసీపీ అధినేత జగన్కు అనుభవం తక్కువ! అన్న మాటలు నిజం అవుతున్నాయి. ఆయన సానుభూతి పరులు సైతం నిన్న మొన్నటి వరకు ఇలాంటి వ్యాఖ్యలను తిప్పికొట్టినా.. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయనను వీరు కూడా ఉతికి ఆరేసేందుకు రెడీ అవుతున్నారు. తాను అధికారంలోకిరావాలి..! ఇది లక్ష్యంగా పెట్టుకున్న ప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులు వేయాలి? ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి ? ఎలా అందరినీ సమన్వయం చేసుకోవాలి? అనే విషయాలపై మాత్రం జగన్ ముందు చూపుతో వ్యవహరించలేక పోతున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరిస్థితి ఏమీ బాగోలేదు. నిజానికి ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల్లో వ్యతిరేక తీవ్రంగా ఉందన్నది అర్థమవుతూనే ఉంది.
విపక్షంలో ఉన్నా….
కానీ.. ఐదేళ్ల విపక్షం స్థానంలో ఉన్న వైసీపీపై మాత్రం ప్రజల్లో సానుభూతి పాళ్లు ఎక్కువ కన్పించాలి. కాని అవి మచ్చుకైనా కన్పించడం లేదు. వీటిని సర్దుబాటు చేయాల్సిన జగన్ మౌనం వహించడం ఒక ప్రధాన తప్పు అయితే.. మరోపక్క, పార్టీ దెబ్బతినేలా ఆయన నిర్ణయాలు తీసుకోవడం, పుట్టి మునిగే వరకు కూడా చూస్తూ కూర్చోవడం, ప్రధాన నాయకులకు వాయిస్ లేకుండా మార్చడం వంటి పరిణామాలు స్వయంకృతంగా జగన్కు మరోసారి పరాభవాన్ని అందించేలా ఉన్నాయి. ప్రతి జిల్లాల్లోనూ వైసీపీలో చిచ్చు రగులుకుంటోంది. అన్ని జిల్లాలోనూ వైసీపీకి ప్రజల్లో సానుకూల పవనాలు వీస్తుండగా, పార్టీలోనే నేతల మధ్య అంతర్గత అభద్రత, అధినేత.. ఆందోళన కలుగుతోంది.
సర్దుబాబు చేయకుండా….
నిజానికి ఏ పార్టీలోనూ నేతలు అందరికీ టికెట్లు ఇవ్వడం సాధ్యంకాదు.ఈ క్రమంలో కొందరికి అన్యాయం జరగొచ్చు. మరికొందరికి అసంతృప్తి రావొచ్చు. ఈ పరిణామాలను ముందుగానే విశ్లేషించుకుని ఆయా నేతలను తన వద్దకు నేరుగా పిలిపించుకుని సర్దు బాటు చేయడం ఏ పార్టీ అధినేత అయినా చేయాల్సిన ప్రధాన పని. పైగా జగన్ వంటి యువనేతలు, చంద్రబాబు వంటి అపర చాణిక్యుడితో తలపడుతున్న నాయకుడు చేయాల్సిన ప్రధాన పని. అయితే, జగన్ ఆవిధంగా చేయకుండా చేతులు కాల్చుకుంటున్నారు. ఎక్కడికక్కడ అసంతృప్తులను పెంచుకుంటున్నారు. అది కూడా ఎన్నికల ముంగిట కావడంతో ఆయన పరిస్థితి ఏమవుతుందోనని పార్టీలోనే కాకుండా ప్రజల్లోని ఓ వర్గం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
- Tags
- ap politics
- janasena party
- nara chandrababu naidu
- pawan kalyan
- y.s. jaganmohan reddy
- ysr congress party
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°ªà± పాలిà°à°¿à°à±à°¸à±
- à°à°¨à°¸à±à°¨ పారà±à°à±
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±
- à°µà±.à°à°¸à±. à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿
- à°µà±à°à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à±
