మోపిదేవితో పాటు ఆ ఇద్దరు ఎవరు..?
ఏపీ, తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏపీలో మూడు, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఈ [more]
ఏపీ, తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏపీలో మూడు, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఈ [more]

ఏపీ, తెలంగాణలో నాలుగు ఎమ్మెల్సీ సీట్ల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏపీలో మూడు, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఈ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీల ఖాతాలోనే ఈ సీట్లు పడనున్నాయి. ఏపీలో వైసీపీకి అసెంబ్లీలో ఏకంగా 151 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఫిగర్‌కు టీడీపీ దరిదాపుల్లో కూడా లేకపోవడంతో ఇప్పుడు ఎన్నికలు జరిగే మూడు సీట్లు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. అయితే ఈ మూడు సీట్లకు ఎవరిని ఎంపిక ? చేయాలి ? అన్నదే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌కు పెద్ద చిక్కుగా మారింది.
ఒకటి మాత్రం….
జగన్ ఎన్నికల ప్రచారంలో సీట్లు త్యాగాలు చేసిన వారికి, పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడిన వారికి ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. ఓవరాల్‌గా జగన్ హామీ ఇచ్చిన వాళ్లే ఏకంగా 15 మంది వరకు ఉన్నారు. వీరితో పాటు పార్టీ అధికారంలోకి వస్తే పదవి ఆశించే వారి లిస్టు కూడా చాలానే ఉంది. ఇప్పుడు వీరిలో ఎవరిని వడపోసి జగన్ ఎమ్మెల్సీ ఇస్తాడన్నదే కాస్త సస్పెన్స్‌గా ఉంది. ఈ మూడు సీట్లలో ఒకటి ఖచ్చితంగా మంత్రి మోపిదేవి వెంకటరమణకు దక్కనుంది.
ఇక్బాల్ కు ఒకటి పోతే….
రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిన మోపిదేవిని జగన్ అనూహ్యంగా తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఆయన ఆరు నెలల్లో ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉన్నందున తప్పనిసరిగా ఎమ్మెల్సీ సీటు ఇవ్వనున్నారు. ఇక జగన్ నుంచి ఎమ్మెల్సీ హామీ వచ్చిన వారితో పాటు పదవి ఆశిస్తోన్న వారిలో గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్, తూర్పుగోదావరి నుంచి పండుల రవీంద్రబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి భరత్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, హిందూపురంలో బాలయ్యపై ఓడిన మహ్మద్ ఇక్బాల్ (జగన్ రంజాన్ ఇఫ్తార్‌లో హామీ ఇచ్చారు), ఉత్తరాంధ్ర నుంచి కిల్లి కృపారాణి, సీమ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, వీరశివారెడ్డి ఇలా చాలా మంది రేసులో ఉన్నారు.
జగన్ నిర్ణయం కోసం….
ఇక ఎన్నికలు అయ్యాక జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఇక్బాల్‌కు మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. ఇప్పటికిప్పుడే మైనార్టీలకు కూడా ఎమ్మెల్సీ ఇస్తే అప్పుడు ఒక్క సీటు మాత్రమే ఉంటుంది. ఈ సీటు కోసం పదుల సంఖ్యలో ఆశావాహులు ఉన్నారు. సీమ నుంచి రెడ్లకు ఇవ్వాల్సి వస్తే రాజంపేటలో మేడా మల్లిఖార్జునరెడ్డి కోసం సీటు వదులుకున్న ఆకేపాటి అమర్నాథ్రెడ్డి లేదా కమ్మలకు ఇవ్వాలనుకుంటే చిలకలూరిపేట సీటు వదులుకున్న మర్రి రాజశేఖర్లలో ఎవరో ఒకరికి ఆ ఛాన్స్ వస్తుందంటున్నారు. మరి జగన్ జెరూసలేం నుంచి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చు.
