జగన్ డెసిషన్ తో డీలా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ ఎలాంటి నామినేటెడ్ పదవులు భర్తీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో [more]
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ ఎలాంటి నామినేటెడ్ పదవులు భర్తీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో [more]

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ ఎలాంటి నామినేటెడ్ పదవులు భర్తీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో గత రెండు నెలల నుంచి పదవులపై ఆశలు పెంచుకున్న వారంతా డీలా పడిపోయారు. రేపో మాపో అని ఆశగా చూస్తున్న నేతలకు నిజంగా ఇది చేదువార్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అమెరికా వెళ్లారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత పూర్తిగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకే సమయం కేటాయించనున్నారు.
ఏదో ఒక పదవి ….
వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తుంది. తొమ్మిదేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నేతలందరూ తమకు పదవులు వస్తాయని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ ఒకసారి మాట ఇస్తే తప్పరు. ఖచ్చితంగా తమకు ఏదో ఒక పదవి దక్కుతుందన్న వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పటి వరకూ జగన్ నామమాత్రంగనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. రోజా, చెవిరెడ్డి వంటి ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చారు. ఎన్నికల్లో ఓటమిపాలయిన ద్రోణం రాజు శ్రీనివాస్ కు సయితం విశాఖ డెవలెప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ గా నియమించారు.
వరస కార్యక్రమాలతో….
తాజాగా వాసిరెడ్డి పద్మను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నియమించారు. ఇలా వరసగా నియామకాలు చేపడుతున్న జగన్ వాటికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. డిసెంబరులో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈలోపు తాను జిల్లాల పర్యటనలు చేయాల్సి ఉంది. అంతేకాకుండా అనేక ముఖ్యమైన కార్యక్రమాలను గ్రౌండ్ చేసి వాటి అమలును పర్యవేక్షించాల్సి ఉంది. అమెరికా నుంచి వచ్చని తర్వాత జగన్ మరింత బిజీగా మారనున్నారు.
ఎన్నికల తర్వాతే…..
అందుకోసమే జగన్ నామినేటెడ్ పోస్టులను ఇప్పుడప్పుడే భర్తీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. పదవులు దక్కని వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సహకరించరన్న అనుమానం కూడా సీనియర్ నేతలు జగన్ వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ ఈ ప్రక్రియను పోస్ట్ పోన్ చేశారంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాతనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండనుంది. దీంతో ఆశించిన నేతలు డీలా పడ్డారు.

