జగన్ బలం అందులోనే ఉంది
జగన్ అసలైన బలం ఈ పాటికి విపక్షాలకు అర్ధమై ఉండాలి. తాము ఎక్కడ పొరపాట్లు చేశామో, జగన్ ఎలా చేసుకువస్తున్నారో బాగా తెలియాలి. జగన్ గెలవడం, ఓడడం [more]
జగన్ అసలైన బలం ఈ పాటికి విపక్షాలకు అర్ధమై ఉండాలి. తాము ఎక్కడ పొరపాట్లు చేశామో, జగన్ ఎలా చేసుకువస్తున్నారో బాగా తెలియాలి. జగన్ గెలవడం, ఓడడం [more]

జగన్ అసలైన బలం ఈ పాటికి విపక్షాలకు అర్ధమై ఉండాలి. తాము ఎక్కడ పొరపాట్లు చేశామో, జగన్ ఎలా చేసుకువస్తున్నారో బాగా తెలియాలి. జగన్ గెలవడం, ఓడడం అన్నది పక్కన పెడితే జగన్ తన బలమైన సామ్రాజ్యాన్ని అలా నిర్మించుకున్నారు. దానికి ఇటుకలు, ఇసుక, సిమెంట్ కాదు, విశ్వసనీయత, మాట మీద నిలబడే తత్వం, తనను ఆదుకున్న వారికి గుర్తు పెట్టుకోవడం, ఈ ఉత్తమ లక్షణాలే జగన్ని పదేళ్ల పాటు ఒంటరిగా పోరాడినా కూడా ఎక్కడా బలహీనున్ని చేయలేదు. జగన్ దగ్గర పైరవీలు చెల్లవు, ఎవరికి ఏం చేయాల్లో సలహాలు, సిఫార్సులు అంతకంటే ఉండవు. అన్నీ జగన్ బుర్ర అన్న డైరీలో ఎంచక్కా పదిలంగా ఉంటాయి. జగన్ ఎవరికి ఏం చేయాలో పిలిచి మరీ పెద్ద పీట వేసి చేస్తారు. ఇపుడు అదే జరుగుతోంది.
అధికారంలోకి వచ్చిన తరువాత…..
జగన్ చేతిలో అధికారం లేనపుడు అంతా ఆయన్ని నమ్మి వెంట నడిచారు. కొందరు మధ్యలోనే వెళ్ళిపోయారు. మరి కొందరు ప్రతిపక్షంలో ఉన్నపుడు వెళ్ళిపోయారు. కొసవరకూ నడచిన వారు మాత్రం ఎక్కువ మందే ఉన్నారు. వారే ఇపుడు జగన్ అధికారంలో ఉండగా పక్కన నిలబడి చూస్తున్నారు. జగన్ తమకు కూడా అధికారం పంచిపెడతాడా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే జగన్ ఎవరినీ కూడా ఎక్కడా నిరాశపరచడంలేదు. ఒక్కొక్కరినీ గుర్తుపెట్టుకుని మరీ వారి నేనున్నానని చెబుతున్నాడు. వారి స్థాయి, అర్హత గుర్తించి మరీ పదవులు పంచుతున్నాడు. నిజంగా ఇది మిగిలిన రాజకీయ పక్షాలు, నాయకులు చూసి తమ లోపాలు సవరించుకోవాల్సిన సమయం. సందర్భం. నాయకుడు అన్న వాడు ఎలా చేయాలో జగన్ అదే చేస్తున్నాదు.
అది చెక్కుచెదరని బలం…..
ఈ రోజు పదవులు, అధికారం జగన్ పక్కన ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. మళ్ళీ రావచ్చు. ఇదంతా ఓ క్రీడ. కానీ జగన్ తనను నమ్ముకున్న వారి మనసులను గెలుచుకుంటున్నాడు. జగన్ ఉన్నాడు, చూసుకుంటాడన్న నమ్మకం ఆయనతో నడచిన వారిలో ఉంది. అందుకే నామినేటెడ్ పోస్టుల పందేరం జరుగుతోంది కానీ ఎక్కడా ఆశావహులు హడావుడి లేదు, పైరవీల జోరు లేదు. చాలా సైలెంట్ గా జగన్ తాను అనుకున్న వారికి పిలిచి పట్టం కడుతున్నారు. మంత్రివర్గం కూర్పు కూడా ఇలాగే సాఫీగా జరిగిపోయింది. ఎందుకంటే అక్కడున్నది జగన్. జగన్ తమను తప్పక చూస్తాడు, గుర్తిసాడు, పిలిచి మరీ పదవులు ఇస్తాడు. మరి కంగారెందుకు. ఇదీ నిజమైన జగన్ సన్నిహితుల మాట. మరి ఇదే కదా జగన్ అసలైన బలం.