జగన్ కు బాగా నచ్చేశారట.. మార్చరట
ఏపీలో మరోసారి మంత్రుల మార్పులు, కూర్పులపై చర్చ జరిగింది. మరో పది నెలల్లో మంత్రి వర్గంలో భారీ మార్పులు, చేర్పులు ఉండడంతో సహజంగా ఇప్పటి నుంచే ఆశావాహులు, [more]
ఏపీలో మరోసారి మంత్రుల మార్పులు, కూర్పులపై చర్చ జరిగింది. మరో పది నెలల్లో మంత్రి వర్గంలో భారీ మార్పులు, చేర్పులు ఉండడంతో సహజంగా ఇప్పటి నుంచే ఆశావాహులు, [more]
ఏపీలో మరోసారి మంత్రుల మార్పులు, కూర్పులపై చర్చ జరిగింది. మరో పది నెలల్లో మంత్రి వర్గంలో భారీ మార్పులు, చేర్పులు ఉండడంతో సహజంగా ఇప్పటి నుంచే ఆశావాహులు, మీడియా వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. తాజా కేబినెట్ లో ఎవరు ఉంటారు ? ఎవరు ఇంటికి వెళ్తారు.. అని కొన్నాళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ ముందే రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రులను తప్పించేస్తానని చెప్పారు. ఈ లెక్కన కేబినెట్ లో ఐదారుగురు మంత్రులు మాత్రమే కంటిన్యూ అయ్యి.. మిగిలిన వారంతా కొత్తవారే వస్తారని స్పష్టమవుతోంది.
అనిల్ ముందున్నారట……
అయితే.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను అధిగమిస్తూ.. ఇద్దరు మంత్రులు జగన్ కేబినెట్ లో ఖచ్చితంగా కొనసాగుతారని తాజా అసెంబ్లీ సమావేశాల వేళ అధికార పార్టీలో చర్చ నడుస్తోంది. వారి దూకుడు, వారి వాయిస్, ఫైర్ బ్రాండ్లుగా వారి ముద్ర రోజు రోజుకు పెరుగుతుండడం వంటివి పరిశీలిస్తే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ జాబితాలో ముందున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలవరంపై చర్చ జరిగిన సమయంలో ఆయన హావభావాలు, వాయిస్.. జగన్‌కు ఎంతో నచ్చాయని వైసీపీలో గుసగుస భారీగా వినిపిస్తోంది.
తొలుత తప్పించాలనుకున్నా…
అదే సమయంలో సబ్జెక్టు విషయంలోనూ ఆయన దూకుడుగానే ఉన్నారని జగన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి కొన్నాళ్లుగా అనిల్ వ్యవహారం రాజకీయంగా చర్చకు వస్తోంది. నెల్లూరులో రెడ్డి వర్గాన్ని డామినేట్ చేస్తున్నారని.. రాజకీయంగా దూకుడు ప్రదర్శిస్తున్నారని.. ఇలా అయితే కష్టమని ఆ వర్గం ఫిర్యాదు చేస్తూ వస్తోంది. దీంతో మంత్రిగా ఆయనను కొనసాగించరనే టాక్ వచ్చింది. కానీ, ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందని అంటున్నారు. ఇక అనిల్‌ను కేబినెట్ నుంచి తప్పిస్తే ఆ వర్గం కోటాల మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి సైతం తనకు ఆశల్లేవన్న నిర్ణయానికి వచ్చేశారట. ఆయనను తప్పిస్తే పోలవరం ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టవని కూడా జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్ని విమర్శలు వచ్చినా….?
ఇక, మరో మంత్రి కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నాని విషయంలోనూ జగన్ చాలా పాజిటివ్‌గా ఉన్నారని అంటున్నారు. సభలోను… బయటా కూడా ప్రతిపక్షంపై దూకుడు ప్రదర్శించే నాయకుల్లో ఆయన ముందున్నారు. చంద్రబాబును నేరుగా అరెయ్.. ఒరెయ్.. అనడం ద్వారా ఆయన మార్కు రాజకీయాలు ప్రదర్శించారు. పైగా కమ్మ వర్గంలో నాని ముందు నుంచే జగన్ వెంట నడిచారు.. ఆయనే సీనియర్. నాని భాష, వ్యవహారంపై ఎన్ని విమర్శలు వచ్చినా బాబు సామాజిక వర్గానికి చెందిన ఆయన దూకుడు రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తల్లో మాంచి జోష్ నింపుతుంటాయి. ఇవి కూడా జగన్‌కు బాగా నచ్చాయని.. అందుకే కనీసం.. ఒక ప్రతిపక్ష నాయకుడిని అలా దూషించినా.. హెచ్చరించలేదని తెగ ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరు మంత్రులకు జగన్ ఎన్ని మార్పులు చేసినా కేభినెట్‌లో ఎలాంటి ఢోకా ఉండదని వైసీపీ వర్గాల టాక్. ఇక పెద్దిరెడ్డి, బుగ్గన లాంటి వాళ్లను ఎలాగూ మార్చరు. మరి ఈ లిస్టులో ఇంకెంత మంది అదృష్టవంతులు చేరతారో ? చూడాలి.