జగన్ లెక్క వేరట.. సాలిడ్ ఓటు బ్యాంకుకు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమాగా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చిన గెలుపు తమదేనన్న విశ్వాసంతో ఉన్నారు. ఇందుకు తాను చేస్తున్న సంక్షేమ పథకాలపైనే జగన్ గట్టిగా [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమాగా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చిన గెలుపు తమదేనన్న విశ్వాసంతో ఉన్నారు. ఇందుకు తాను చేస్తున్న సంక్షేమ పథకాలపైనే జగన్ గట్టిగా [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమాగా ఉన్నారు. ఏ ఎన్నిక వచ్చిన గెలుపు తమదేనన్న విశ్వాసంతో ఉన్నారు. ఇందుకు తాను చేస్తున్న సంక్షేమ పథకాలపైనే జగన్ గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు. సంక్షేమ పథకాలతో పాటు వాలంటీర్ల వ్యవస్థ కూడా తన పార్టీ విజయానికి ఢోకా ఉండదని జగన్ పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అందుకే ఆయన పార్టీలో తలెత్తే విభేదాలు, విపక్షాలు చేసే విమర్శలను లైట్ గా తీసుకుంటున్నట్లు కనపడుతుంది.
ముఖ్యనేతలు జగన్ ను…..
ఇటీవల కొందరు ముఖ్యనేతలు జగన్ ను కలిశారు. వీరంతా గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాకు చెందిన నేతలు. సహజంగా జగన్ తనను కలవగానే అడిగే మొదటి క్వశ్చన్ బాగున్నావా అన్నా అని. అలా క్షేమ సమాచారాలు అయిపోయిన తర్వాత నియోజకవర్గాలు, జిల్లా పరిస్థిితిపై ఆరా తీయడం జగన్ కు అలవాటు. అలాగే జిల్లా పరిస్థితి ఎలా ఉందని జగన్ అడిగిన వెంటనే ఒక ముఖ్యనేత తన మనసులో మాటను కుండబద్దలు కొట్టేశారట.
తమ పరిస్థితిపై….
అమరావతి రాజధాని అంశంతో పార్టీ పరిస్థితి మా జిల్లాలో బాగా లేదని, మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ పార్టీపైనా, ఎమ్మెల్యేలపైనా వ్యతిరేక ప్రచారం జరుగుతుందని చెప్పారు. అమారావతి రాజధాని తరలింపుతో తమ భవిష్యత్ ఏందని వారిలో ఒకరిద్దరు జగన్ ను అడిగినట్లు చెబుతున్నారు. అయితే ఎప్పటిలాగానే జగన్ చిరునవ్వు నవ్వి.. వారికి హితబోధ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ధైర్యం చెప్పిన…..
“మన ఓటు బ్యాంకు ఇప్పుడు వేరే గా ఉంది. వాళ్లంతా మనకు తప్ప ఎవరికీ వేయరు. రాష్ట్రంలో దాదాపు 3.5 కోట్ల మందిని ఓటు బ్యాంకుగా మలుచుకోవడంలో సక్సెస్ అయ్యాం. ఎల్లో మీడియా ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా మన ఓటు బ్యాంకు చెక్కుచెదరదు. వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు ఖాయం. ఏ ఎన్నిక జరిగినా మనదే గెలుపు” అని జగన్ వారికి ధైర్యం చెప్పారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జగన్ నమ్మకమంతా తాను నగదు పథకాలతో ఆకట్టుకుంటున్న వారు తన నుంచి బయటకు వెళ్లలేరన్న ధీమాలోనే ఉన్నట్లుంది. మరి జగన్ అంచనా నిజమే అయితే అది తిరుపతి ఉప ఎన్నికల్లో తేలిపోతుంది.

