ఎన్నాళ్లిలా జగన్?
వైసీపీలో సీనియర్లు చాలా మంది ఇప్పుడు పదవుల వేటలో పడ్డారని తెలుస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తమ సీట్లను త్యాగం చేసిన వారు అదే సమయంలో [more]
వైసీపీలో సీనియర్లు చాలా మంది ఇప్పుడు పదవుల వేటలో పడ్డారని తెలుస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తమ సీట్లను త్యాగం చేసిన వారు అదే సమయంలో [more]

వైసీపీలో సీనియర్లు చాలా మంది ఇప్పుడు పదవుల వేటలో పడ్డారని తెలుస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తమ సీట్లను త్యాగం చేసిన వారు అదే సమయంలో ఆర్థికంగా పార్టీని ముందుండి నడిపించిన వారు, జగన్‌ను సీఎం చేయాలని తపించిన వారు, వైసీపీ అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమించిన వారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. వీరిలో చాలా మంది వైసీపీ ఏర్పాటైన దగ్గర నుంచి ఉండగా మరికొందరు టీడీపీ సహా ఇతర పార్టీల నుంచి వచ్చి జగన్‌కు జైకొట్టిన వారు కూడా ఉన్నారు.
అనేకమంది ఇలాగే…..
ఇప్పుడు ఇలాంటి వారు జగన్ సీఎం అయ్యాడని, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైందని సంతోషం వ్యక్తం చేస్తున్నా.. లోలోన మాత్రం కొంత మేరకు అసంతృప్తి వీరిని కుంగదీస్తోంది. తమ ప్రభుత్వం వస్తే తమకు ఏదైనా మేలు జరుగుతుందని కొందరు ఆశించారు. మరికొందరికి జగనే స్వయంగా హామీలు గుప్పించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పడి పది మాసాలు పూర్తయిన నేపథ్యంలో తమకు ఇప్పటికీ ఎలాంటి ఛాన్స్‌లు దక్కలేదని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిలో దాడి వీరభద్రరావు, లేళ్ల అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్ … సహా చాలా మంది ఉన్నారు.
మండలి రద్దు కావడంతో….
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 200 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో ఆయా పోస్టులపై కొందరు ఆశలు పెట్టుకున్నారు. మరికొందరు మండలి పై ఆశలు పెట్టుకున్నా ఇటీవల దానిని రద్దు చేస్తూ జగన్ నిర్ణయించడంతో వారు కూడా ఇప్పుడు నామినేటెడ్ పదవులవైపే తమ దృష్టి కేంద్రీకరించారు. అయితే, ఇప్పటికిప్పుడు వీటిని భర్తీ చేసే ఆలోచన జగన్‌కు లేక పోవడంతో వారు నిరుత్సాహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే….
త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటిలో సత్తా చూపించిన వారికి ఈ పదవులు ఇచ్చే ఆలోచన చేస్తుండడంతో పదవులు ఆశిస్తున్నవారు కొంత అసహనంతో ఉన్నారని తెలుస్తోంది. గతంలో చంద్రబాబు పదవుల భర్తీ విషయంలో నాన్చడంతోనే పార్టీ కేడర్‌లో అసహనం పెరిగి అది పార్టీకి పెద్ద మైనస్ అయ్యింది. మళ్లీ జగన్ కూడా అదే రిపీట్ చేస్తాడా ? లేదా పోస్టులు త్వరగా భర్తీ చేసి అసహనానికి చెక్ పెట్టేస్తాడా ? అన్నది చూడాలి.
