బాబు ముఖం చూడనంటున్న జగన్…?
నిజంగా ఇది జన్మ వైరంలాగానే ఉంది. లేకపోతే ఆయనకు ఈయన పొడ గిట్టదు, ఈయనకు ఆయన పేరెత్తితేనే చికాకు. ఏపీలో మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లను తన [more]
నిజంగా ఇది జన్మ వైరంలాగానే ఉంది. లేకపోతే ఆయనకు ఈయన పొడ గిట్టదు, ఈయనకు ఆయన పేరెత్తితేనే చికాకు. ఏపీలో మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లను తన [more]

నిజంగా ఇది జన్మ వైరంలాగానే ఉంది. లేకపోతే ఆయనకు ఈయన పొడ గిట్టదు, ఈయనకు ఆయన పేరెత్తితేనే చికాకు. ఏపీలో మొత్తానికి మొత్తం అసెంబ్లీ సీట్లను తన ఖాతాలో వేసుకున్నా కూడా జగన్ కి మనశ్శాంతి లేదు అంటున్నారు. చంద్రబాబు తనకు ఉన్న కొద్ది పాటి ఎమ్మెల్యేలతో సభలో ఉండడమే జగన్ కి కంటగింపుగా ఉందని అంటున్నారు. అందుకే జగన్ జమానాలో శాసనసభ సమావేశాలు పెద్దగా జరగడంలేదు అన్న ప్రచారం అయితే గట్టిగానే ఉంది.
బడ్జెట్ సెషనే లేదు …..
జగన్ ఏలుబడిలో బడ్జెట్ సమావేశాల ఊసే లేదు అంటున్నారు. జగన్ 2019 ఎన్నికలలో అధికారంలోకి వచ్చారు. ఆయన సీఎం అయ్యాక తొలిసారి బడ్జెట్ సమావేశాలు జూన్ లో నిర్వహించి కొన్నాళ్ళు నడిపారు. అదే పూర్తి బడ్జెట్ మీటింగ్ అనుకోవాలి. ఆ తరువాత 2020లో కరోనా కారణంగా బడ్జెట్ సెషన్ పూర్తిగా జీరో అయింది. మొదట అర్డినెన్స్ తెచ్చారు, ఆ తరువాత మూడు రోజుల పాటు అదే ఏడాది జూన్ లో సమావేశాలు నిర్వహించి మమ అనిపించేశారు. ఇపుడు చూస్తే ఈ ఏడాది కూడా బడ్జెట్ సమావేశాలు లేకుండానే కధ ముగిసింది. ఆర్డినెన్స్ మళ్ళీ తెచ్చారు. ఇక జూన్ లో యధావిధిగా కొన్ని రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు పెట్టి మిగిలిన కాలానికి బడ్జెట్ ఆమోదించుకుంటారని అంటున్నారు.
సభకు నమస్కారం ….
ఇక చట్ట సభలో అతి ఎక్కువ కాలం జరిగేది బడ్జెట్ సమావేశాలే. ఆ తరువాత వర్షాకాల, శీతాకాల సమావేశాలు చాలా తక్కువ రోజులు జరుగుతాయి. జగన్ సర్కార్ ఇప్పటికి రెండు బడ్జెట్ సమావేశాలను కాకుండా చేసుకుంది. ఇక మిగిలింది రెండే ఉంటాయి. 2024 నాటికి ఓటాన్ అకౌంట్ తోనే సరిపోతుంది. ఇప్పటికి కధ చూస్తే వచ్చే బడ్జెట్ సమావేశాలు అయినా పూర్తి కాలం జరుగుతాయా అన్న చర్చ అయితే ఉంది. అదే సమయంలో ఇంత బలం ఉండి కూడా సభకు నమస్కారం అని ఎందుకు జగన్ సర్కార్ అంటోంది అంటే రాజకీయ కారణాలే అంటున్నారు.
ముఖా ముఖీ వద్దా…?
సభ పెడితే చంద్రబాబు వస్తారు. ఆయన ఏదో అంశం మీద రచ్చ చేస్తారు. దాంతో సభ నుంచి టీడీపీని బహిష్కరించినా వారికే పొలిటికల్ మైలేజ్, సభలో ఉంచినా వారిదే పై చేయి అన్నట్లుగా సీన్ ఉంది. దాంతో ఎందుకీ తలనొప్పి అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే అమరావతి భూములకు సంబంధించి బాబు మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తారు అన్న ప్రచారం కూడా ఉంది. బహుశా బాబును అరెస్ట్ చేసిన తరువాత ఆయన లేని సభను నిర్వహిస్తారేమో అన్న మాట కూడా ఉందిట. మొత్తానికి జగన్ బాబు అసెంబ్లీ వేదికగానే ఎపుడైనా కనిపిస్తారు. ఇక మీదట అలా తారసపడే సందర్భాలు ఉంటాయా అన్న సందేహాలు అయితే వచ్చేస్తున్నాయి. దీని మీద టీడీపీ నేత యనమల రాంక్రిష్ణుడు మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలను నిర్వహించకపోవడం దుష్ట సంప్రదాయమని గట్టిగానే కామెంట్స్ చేశారు.

