జీరో చేయడానికే జగన్ ప్రయత్నాలా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లే కన్పిస్తుంది. రాష్ట్రంలో బీజేపీని జీరో చేసే విధంగానే జగన్ అడుగులు కొనసాగుతున్నాయి. ఎప్పటికైనా బీజేపీకి తన [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లే కన్పిస్తుంది. రాష్ట్రంలో బీజేపీని జీరో చేసే విధంగానే జగన్ అడుగులు కొనసాగుతున్నాయి. ఎప్పటికైనా బీజేపీకి తన [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లే కన్పిస్తుంది. రాష్ట్రంలో బీజేపీని జీరో చేసే విధంగానే జగన్ అడుగులు కొనసాగుతున్నాయి. ఎప్పటికైనా బీజేపీకి తన అవసరం ఉంటుందని జగన్ కేంద్ర నాయకత్వానికి చెప్పే విధంగా సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జగన్ పార్టీ తిరుపతి ఉప ఎన్నికలో కూడా భారీ మెజారిటీని సాధించేందుకు ప్రయత్నిస్తుంది.
బీజేపీని ఇరుకున పెట్టేందుకే……
ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీని ఇరుకునపెట్టాలన్నదే జగన్ ఆలోచనగా కన్సిస్తుంది. పార్లమెంటు సమావేశాలను ఇందుకు తమకు అనుకూలంగా జగన్ వినియోగించుకుంటున్నారు. గత కొంతకాలంగా పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బీజేపీని ఇరుకునపెట్టేందుకే జగన్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కన్పిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై జగన్ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది.
పార్లమెంటు సాక్షిగా…..
స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దంటూ జగన్ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు. అదే విధంగా తన ఎంపీల చేత పార్లమెంటు, రాజ్యసభల్లో స్టీల్ ప్లాంట్ పై ప్రశ్నలు వేయిస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది. విజయసాయరెడ్డి నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. తాము స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకమని సభ సాక్షిగా జగన్ వారి చేత చెప్పించారు.
బీజేపీకి ఇబ్బందులే….
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఏ కార్యక్రమానికైనా ప్రభుత్వం మద్దతిస్తుండటం విశేషం. ఇప్పటికి విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ రెండుసార్లు జరిగింది. ఈ రెండు సార్లు జగన్ ప్రభుత్వం బంద్ కు మద్దతిచ్చి తాము కేంద్ర ప్రభుత్వం వైపు లేమని స్పష్టంగా చెప్పింది. ప్రత్యేక హోదా కూడా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుంది. ఇలా బీజేపీని జీరో చేసే ప్రయత్నంలోనే జగన్ ఉన్నట్లు కన్పిస్తోంది. అలా బీజేపీని జీరో చేసి తన వద్దకు కేంద్ర నాయకత్వం వచ్చేలా జగన్ పావులు కదుపుతున్నార. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

