ఫాలో ఫాలో ఫాలో జగన్…?
గట్టిగా రెండేళ్ళ సీఎం అనుభవం కూడా జగన్ కి లేదు. కానీ ఆయన మాత్రం సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రులందరికీ ఆదర్శమైపోతున్నారు. జగన్ గురించి ఒక్క మాట గట్టిగానే [more]
గట్టిగా రెండేళ్ళ సీఎం అనుభవం కూడా జగన్ కి లేదు. కానీ ఆయన మాత్రం సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రులందరికీ ఆదర్శమైపోతున్నారు. జగన్ గురించి ఒక్క మాట గట్టిగానే [more]

గట్టిగా రెండేళ్ళ సీఎం అనుభవం కూడా జగన్ కి లేదు. కానీ ఆయన మాత్రం సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రులందరికీ ఆదర్శమైపోతున్నారు. జగన్ గురించి ఒక్క మాట గట్టిగానే దేశమంతా చెప్పుకుంటోంది. ఆయనను సంక్షేమ పధకాల స్పెషలిస్ట్ అని కూడా కీర్తిస్తోంది. దేశంలో కొన్ని దశాబ్దాలుగా పధకాలు ఉన్నాయి. కానీ వాటిని కొత్త పుంతలు తొక్కించి జన హృదయాలను గెలుచుకోవడం ఎలాగో ఒక్క జగన్ కే తెలుసు అంటున్నారు. అందుకే అంతా ఫాలో ఫాలో జగన్ అని వెనకాల పడుతున్నారు.
దీదీదీ అదే బాట…..
దేశంలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యమైనది పశ్చిమ బెంగాల్ అన్నది. ఇక్కడ పదేళ్ళుగా రెండు టెర్ములు అధికారం అనుభవించింది మమతా బెనర్జీ, తాజాగా ఆమె హ్యాట్రిక్ కోసం ఉవ్విళ్ళూరుతున్నారు. అంతే మమత ఇపుడు జగన్ సంక్షేమ పధకాలనే ఆ రాష్ట్రంలో వల్లె వేస్తున్నారు. వాటినే ఆయుధాలుగా చేసుకుని హామీలు గుప్పిస్తున్నారు. అందులో ప్రధానమైనది ఇంటింటికీ రేషన్ సరుకులు అందించే పధకం. దీన్ని ఏపీలో జనవరి 21న జగన్ ఆర్భాటంగా ప్రారంభించారు. ఇపుడు అదే పధకం దీదీకి బాగా నచ్చేసింది. ఇక మీదట రేషన్ సరకుల కోసం ఎవరూ దుకాణాలకు రావాల్సిన అవసరం లేదు మేమే మీ ఇంటికి తెచ్చి ఇస్తామని అచ్చం జగన్ మాదిరిగానే ఆమె ఎన్నికల్లో హామీ ఇచ్చేశారు.
ఈయనా అంతేగా…?
ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే ఘర్ ఘర్ రేషన్ యోజన పేరిట జగన్ పధకాన్నే అమలు చేస్తున్నారు. ఆయనకు కూడా ఇది బాగా నచ్చినట్లుంది. అందుకే జనాలు రేషన్ కోసం షాపులకు రావద్దు, మేమే తెచ్చి ఇస్తామని చెబుతున్నారు. మరి ఈ కార్యక్రమం ఇంకెన్ని చోట్ల ఆకట్టుకుంటుందో తెలియదు కానీ జగన్ పధకాలు అంటే మాత్రం జాతీయ స్థాయిలో పాపులర్ అవుతున్నాయి. ఇంకో వైపు చూసుకుంటే తమిళనాడులో కూడా జగన్ ఎన్నికల మ్యానిఫేస్టోని కాపీ కొట్టి ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. అందులో నగదు బదిలీ పధకాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏపీలో మూడు రాజధానులు అని జగన్ అంటే అయిదు రాజధానులు అని అక్కడ ఒక రాజకీయ నేత హామీ ఇవ్వడమూ విశేషమే.
అదే తేడా …?
హామీలు ఇవ్వడం గొప్ప కాదు, కొత్త పధకాలు సృష్టించడమూ కష్టం కాదు, కానీ కాలాన్ని పరిస్థితులను కూడా తట్టుకుని వాటిని ధీటుగా అమలు చేయడమే గొప్ప. ఏపీలో అయితే ఇంటింటికీ రేషన్ ప్రొగ్రామ్ ఫెయిల్ అని విపక్షాలు అంటున్నా జగన్ మొక్కవోని ధైర్యంతో అమలు చేస్తున్నారు. అది జనాలకు మెల్లగా ఎక్కుతోంది. పైగా అందరికీ రేషన్ సరుకులు దక్కడం ఈ పధకం ప్రత్యేకత. గతంలో అయితే డీలర్ సరకు లేదు అంటే రేషన్ బంద్. కానీ ఇపుడు కచ్చితంగా అందరికీ అందుతున్నాయి. ఇలాగే జగన్ ఏ పధకమైనా అమలులో కచ్చితత్వం ఉంది. మరి దేశంలో మిగిలిన రాష్ట్రాలు వీటిని ఆదర్శంగా తీసుకున్నా అమలులో తడబాటు పడితే మాత్రం అక్కడ రిజల్ట్ కూడా తేడా కొడుతుంది అంటున్నారు విశ్లేషకులు.

