జగన్ కదులుతున్నారు… వారంతా హ్యాపీయేనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత జగన్ పెద్దగా జనంలోకి వెళ్లిందిలేదు. తొలి ఏడాది పాలనపై దృష్టి పెట్టిన [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత జగన్ పెద్దగా జనంలోకి వెళ్లిందిలేదు. తొలి ఏడాది పాలనపై దృష్టి పెట్టిన [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత జగన్ పెద్దగా జనంలోకి వెళ్లిందిలేదు. తొలి ఏడాది పాలనపై దృష్టి పెట్టిన జగన్ కు తర్వాత కరోనా వైరస్ తో పర్యటనలకు బ్రేక్ పడింది. దీంతో జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. దాదాపు ఇరవై నెలల నుంచి జగన్ పెద్దగా జిల్లాల్లో పర్యటించింది లేదు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కూడా జగన్ దూరంగా ఉన్నారు.
రెండేళ్ల పాలన పూర్తి కావస్తుండటంతో….
అయితే పాలన రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో జగన్ జిల్లా పర్యటనలు చేయాలని నిర్ణయించారు. అసెంబ్ల ీసమావేశాలు ఈ నెలాఖరుతో ముగిసే అవకాశముంది. ఆ తర్వాత జగన్ జిల్లాల్లో పర్యటించే అవకాశముంది. తన తండ్రి ప్రారంభించాలనుకున్న రచ్చ బండ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నారు. అందుకోసమే ముందుగా సమస్యగా ఉన్న రహదారుల అభివృద్ధి కోసం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను కేటాయించారు.
నేతల్లోనే ఎక్కువ ఆసక్తి….
జగన్ జిల్లా పర్యటనలపై ప్రజల కంటే నేతలకే ఎక్కువగా ఆసక్తి ఉంది. అనేక జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గ్రూపు విభేదాలతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాల పర్యటనకు జగన్ వస్తే పార్టీలోని విభేదాలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అంతేకాకుండా తమ నియోజకవర్గంలోని దీర్ఘకాలక సమస్యలపై కూడా జగన్ స్పందించే అవకాశముండటంతో జిల్లా నేతలందరూ జగన్ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సమస్యల పరిష్కారమవుతాయని….
ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగాయి. వైసీపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో వారందరిలోనూ జగన్ పర్యటనలు జోష్ నింపనుంది. ప్రధానంగా రానున్న మూడేళ్లు సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని జగన్ నిర్ణయించారు. ప్రధానంగా రచ్చబండ కార్యక్రమంలో జిల్లా కేంద్రాలు కాకుండా తొలుత మారుమూల నియోజకవర్గాలను ఎంపిక చేయాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ పర్యటనపై జనాల కన్నా నేతలే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.

