ఈ నిర్ణయం ఎప్పటికీ కష్టమే జగనూ?
జగన్ సర్కార్ వేడి మీద తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. ఇప్పటికే ఎవరికి పడితే వారికి అనేక రకాలుగా పధకాలు పెట్టిన ఉత్త పుణ్యానికి డబ్బులు [more]
జగన్ సర్కార్ వేడి మీద తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. ఇప్పటికే ఎవరికి పడితే వారికి అనేక రకాలుగా పధకాలు పెట్టిన ఉత్త పుణ్యానికి డబ్బులు [more]

జగన్ సర్కార్ వేడి మీద తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. ఇప్పటికే ఎవరికి పడితే వారికి అనేక రకాలుగా పధకాలు పెట్టిన ఉత్త పుణ్యానికి డబ్బులు తెచ్చి చేతిలో పెడుతున్న జగన్ వైఖరి మీద మేధావుల్లో హాట్ హట్ గానే చర్చ ఉంది. అయితే నగదు తీసుకుంటున్న జనాలు మాత్రం దీనిని భేష్ అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీ అభివృద్ధి అక్కరలేదని రాజకీయమే జగన్ కి ముఖ్యమని విపక్షాలు అంటున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు ఓట్ల పంట కోసమే జగన్ మరో పధకానికి తెర లేపారని అన్న కామెంట్స్ వచ్చి పడుతున్నాయి.
ఎందుకొచ్చిన తంటా…..
ఇంటింటికీ రేషన్ అంటూ జగన్ సర్కార్ తాజాగా ప్రారంభించిన ఈ పధకం పట్ల అందరూ పెదవి విరుస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఏడాదికి వేయి కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఖాళీ ఖజానాకు ఇది అతి పెద్ద భారం అని కూడా అంటున్నారు. అయినా సరే జగన్ డేరింగ్ గా ఈ పధకాన్ని ప్రారంభించారు. ప్రతీ ఇంటికీ వెళ్లి తలుపులు తోసుకుని మరీ రేషన్ సరకు వారి నట్టింట్లో పెడతామని మొదట్లో చెప్పుకొచ్చారు. తీరా ఆచరణలో చూస్తే ఇది అసలు అమలు కావడంలేదు. వీధి మొదట్లో వాహనం ఆపేసి అందరినీ అక్కడికే రమ్మనమని క్యూ కట్టించి మరీ రేషన్ ఇస్తున్న వైనం కనిపిస్తోంది.
డైలామాలో జనం ….
ఇక ఈ పాస్ మిషన్లు సరిగ్గా పనిచేయకపోతే వారికి రేషన్ లేదు. దాంతో వారు మళ్లీ ఎపుడు ఇస్తారు అని అడగాల్సి వస్తోంది. పోనీ రేషన్ దుకాణానికి వెళ్దామనుకున్నా అక్కడ ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేస్తున్నారు. దీంతో రేషన్ సరిగ్గా లేక రాక మెజారిటీ జనం పడే అవస్థలు వర్ణానాతీతం. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాదర జనం ఇళ్ళలో ఉండరు, అలాటపుడు వారి కోసం సాయత్రం రావాలి అంటే వాలంటీర్లు అందుబాటులో ఉండరు, ఇలా ఇంటింటికీ రేషన్ పధకం ఆచరణలో ఎన్నో కష్టాలు పడుతోంది. తాజాగా వాహదారుల బాధలు తెలుసుకుని వారు కోరినట్లుగా జగన్ సర్కార్ వేతనాలు పెంచినా కూడా ఇది సక్సెస్ అయ్యేది కష్టమేనని అధికారులే తేల్చేస్తున్నారు.
దండుగమారిగా …
ఒక్క ఏజెన్సీలలో తప్ప పట్టణాలు, గ్రామలలో రేషన్ దుకాణలు ఏమంత దూరంలో ఉండవు. పైగా తన పని చూసుకుని ఏ టైం కి రేషన్ దుకాణానికి వెళ్ళినా సరకు తెచ్చుకునే వెసులుబాటు లబ్ధిదారులకు ఇప్పటిదాకా ఉండేది. దాన్ని కాదని తమ వీధివైపు వచ్చే ఇంటింటి రేషన్ వాహనం కోసం కాచుకుకూర్చోవడం అంటనే పెద్ద శిక్ష అంటున్నారు. ఇక జనాలకు రేషన్ ఇంటింటికీ ఇవ్వమని ఎవరూ అడగలేదు కదా అన్న మాట లబ్దిదారుల నుంచే వస్తోంది. ఓ వైపు కమిషన్ తగ్గించేసి రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఏటూ చెడ్డ అయింది. మరో వైపు జనాలకు రేషన్ సరిగ్గా అందకపోతే వారు కూడా జగన్ సర్కార్ మీద గుర్రుమంటారు. ఇక ప్రభుత్వానికి వేయి కోట్ల రూపాయల అదనపు ఖర్చు తప్ప దీని వల్ల ఒరిగేది లేదని అంటున్నారు. రాజకీయంగా హిట్ అయితే ఓకే కానీ వేస్ట్ అయితే మాత్రం ఎందుకీ పధకమని వైసీపీ నేతల నుంచే వస్తున్న మాట. మొత్తానికి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆచరణలో ఎప్పటికీ కష్టమేనని అంటున్నారు.

