ఆ ఆలోచనే ఇప్పట్లో లేదట
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన ఇప్పట్లో తనకు లేదని తెలంగాణ [more]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన ఇప్పట్లో తనకు లేదని తెలంగాణ [more]

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన ఇప్పట్లో తనకు లేదని తెలంగాణ నేతలకు సమాచారం పంపారట. ఇటీవల షర్మిల నేతృత్వంలో మరో పార్టీ వస్తుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొందరు తెలంగాణ నేతలు జగన్ సంప్రదించినప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. తెలంగాణలో పార్టీ గురించి ఇప్పుడు తాను ఆలోచించడం లేదని చెప్పినట్లు సమాచారం.
ఆరేళ్ల నుంచి….
నిజానికి తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత దాని కార్యకలాపాలు ఏమీ లేవు. తెలంగాణకు ప్రత్యేకంగా పార్టీ కార్యవర్గాన్ని కూడా జగన్ ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదు. 2014లో ఏపీలో వైసీపీ ఓటమి పాలు కావడంతో జగన్ దృష్టంతా ఏపీపైనే పెట్టారు. అక్కడే పార్టీని బలోపేతం చేయగలిగారు. దాదాపు ఏడాదిన్నర పాదయాత్ర చేసి ఏపీలో జగన్ పార్టీని అధికారంలోకి తేగలిగారు.
ఏ ఎన్నికల్లోనూ….
2014 తర్వాత తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ వైసీపీ పోటీ చేయలేదు. జగన్ కూడా అందుకు సుముఖంగా లేరు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ, ఉప ఎన్నికల్లోనూ వైసీపీ పోటీ చేయలేదు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణలో ఆ పార్టీని 2014లో మూసివేసినట్లే అనుకోవాలి. తెలంగాణలోని కొందరు నేతలకు కొన్ని పదవులు మాత్రం జగన్ ఇవ్వగలిగారు.
భవిష్యత్ లో కూడా..?
వైసీపీకి ఇప్పటికీ తెలంగాణలో ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్ ఇక్కడ బలహీనంగా ఉండటంతో ఒక సామాజికవర్గం నేతలు వైసీపీికి ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే అవకాశాలున్నాయి. కానీ జగన్ మాత్రం ఇక తెలంగాణ వైపు చూసేందుకు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం తెలంగాణలో వైసీపీని జగన్ పట్టించుకోరన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. అయితే ఆ తర్వాత పరిణామాలు చెప్పలేమని, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని అనే వారుకూడా లేకపోలేదు. మొత్తం మీద ప్రస్తుతానికి అయితే తెలంగాణలో వైసీపీ ఇక లేనట్లేనని చెప్పుకోవాల్సిందే.

