జగన్ వచ్చిన తర్వాతే ఎందుకిలా?
ఎప్పుడూ లేనిది ఎందుకిలా? ఎవరు చేస్తున్నారు? కావాలనే చేస్తున్నారా? లేక కాకతీళయంగా జరుగుతున్న వేనా? ఈ ప్రశ్నలన్నింటికీ మాత్రం ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా జగన్ [more]
ఎప్పుడూ లేనిది ఎందుకిలా? ఎవరు చేస్తున్నారు? కావాలనే చేస్తున్నారా? లేక కాకతీళయంగా జరుగుతున్న వేనా? ఈ ప్రశ్నలన్నింటికీ మాత్రం ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా జగన్ [more]
ఎప్పుడూ లేనిది ఎందుకిలా? ఎవరు చేస్తున్నారు? కావాలనే చేస్తున్నారా? లేక కాకతీళయంగా జరుగుతున్న వేనా? ఈ ప్రశ్నలన్నింటికీ మాత్రం ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇది రాజకీయ ప్రేరితమా? కావాలని చేస్తున్నారా? అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. కానీ ఈ వరస సంఘటలు మాత్రం జగన్ ప్రభుత్వానికి ఇబ్బందిగానే మారుతున్నాయి.
ఎవరు అధికారంలో ఉన్నా…..
నిజానికి ఎవరు అధికారంలో ఉన్నా మతపరమైన విశ్వాసాలతో ఆడుకోదు. రాజకీయంగా తనకు నష్టం కలిగిస్తుందని తెలుసు. జగన్ హిందూ ద్వేషి కాదు. మతపరమైన వివాదాల జోలికి అసలే పోరు. అలాగని ఏపీలో ఉన్న చిన్నా చితకా దేవాలయాన్నింటికీ భద్రత కల్పించాలన్నా అది ఆచరణలో సాధ్యపడదు. దీనిని అవకాశంగా తీసుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న ఉద్దేశ్యంతోనే హిందూ దేవాలయాలపై వరస దాడులు జరుగుతున్నాయని సులువుగానే అర్థమవుతుంది.
అయితే సమాధానం మాత్రం…..
అయితే ఇలా దాడులు పాల్పడే వారిని పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై నే ఉంది. దాడులకు సంబంధించిన లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం కూడా ప్రభుత్వమే చెప్పాల్సి ఉంటుంది. అంతర్వేది రథం దగ్దం రాష్ట్రమంతటా కలకలం రేపింది. దీనిపై జగన్ స్వయంగా సీఐబీ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత దుర్గగుడిలో వెండి సింహాలు మాయమయ్యాయి. అయితే లాక్ డౌన్ సమయంలో కొందరు డబ్బుల కోసం ఇవి చేసి ఉంటారని ప్రాధమిక దర్యాప్తులో తేలింది.
వరస సంఘటనలతో…..
ఇక తాజాగా విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం కేసు మరో మారు చర్చనీయాంశమైంది. దీనిపై జగన్ సీరియస్ అయి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగానే తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి ఆలయంలో కూడా విగ్రహాల ధ్వంసం జరిగింది. ఇలా వరస సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే కొందరు దీనిని చేస్తున్నారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఏది ఏమైనా హిందూ దేవాలయాలపై దాడులను నియంత్రించకపోతే జగన్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొనక తప్పదు.