తిరుపతి తేడా రాకుండా జగన్?
తిరుపతి ఉప ఎన్నికకు వైసీపీ సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరు ఖరారయింది. అధికారికంగా పేరును ప్రకటించనప్పటికీే ఆయనకే టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. [more]
తిరుపతి ఉప ఎన్నికకు వైసీపీ సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరు ఖరారయింది. అధికారికంగా పేరును ప్రకటించనప్పటికీే ఆయనకే టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. [more]

తిరుపతి ఉప ఎన్నికకు వైసీపీ సర్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరు ఖరారయింది. అధికారికంగా పేరును ప్రకటించనప్పటికీే ఆయనకే టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే తిరుపతిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో బలమైన నేతలను, పార్టీకి నమ్మకంగా ఉన్న నేతలకు బాధ్యతలను అప్పగించాలని జగన్ భావిస్తున్నారు.
అసంతృప్తిలో వైసీపీ నేతలు….
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాలున్నాయి. ఇందులో కొన్ని చోట్ల వైసీపీ నేతల్లోనే అసంతృప్తి నెలకొంది. అసంతృప్తి ఉన్న నియోజకవర్గాల్లో ముందుగా పార్టీ నేతలను కూర్చోబెట్టి చర్చించాలని జగన్ నిర్ణయించారు. అయినా కొందరి నేతలపై అనుమానాలు ఉన్నాయి. సక్రమంగా పార్టీకి చేస్తారన్న నమ్మకం లేకపోవడంతో అన్ని నియోజకవర్గాలకు బలమైన, నమ్మకమైన నేతలను జగన్ ఎన్నికల ఇన్ ఛార్జులుగా నియమించనున్నారు.
బలమైన, నమ్మకమైన నేతలకు….
ప్రధానంగా గూడూరు నియోజకవర్గంలో అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే వరప్రసాద్ కు వైసీపీలోని మరొక ప్రధాన వర్గానికి మధ్య పొసగడం లేదు. ప్రత్యేక సమావేశాలను పెట్టుకుని ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బాధ్యతలను పార్టీ సీనియర్ నేతలకు ఇద్దరికి అప్పగించాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. ప్రచారంతో పాటు ఎన్నికలకు సంబంధించి అన్ని కార్యక్రమాలూ వీరి పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది.
మండలాల వారీగా బాధ్యతలు…..
ఇక వెంకటగిరిలోనూ చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు బాధ్యతలను అప్పగిస్తారని తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి పార్టీ పట్ల, జిల్లా నేతల పట్ల అసంతృప్తిగా ఉండటంతో ఇక్కడ ఆర్కే రోజాకు, మరో మంత్రికి బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం. ఈ రెండు నియోజకవర్గాలతో పాటు శ్రీకాళహస్తి, సత్యవేడు, సర్వేపల్లి నియోజకవర్గాలకు కూడా ఇన్ ఛార్జిలను మండలాల వారీగా నియమించనున్నట్లు చెబుతున్నారు. నేతల్లో అసంతృప్తి ఉందని గ్రహించిన జగన్ ముందు జాగ్రత్తగా ఫలితం తేడా రాకుండా నమ్మకమైన నేతలకు బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలిసింది.

