అంత భయమా…?
పవన్ కళ్యాణ్ సినిమా నటుడిగానే ఇప్పటికీ ఫేమస్. ఆయన రాజకీయం అయిదేళ్ళకే తేలిపోయింది. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన తాజా ఎన్నికల్లో దారుణమైన ఫలితాలను నమోదు చేసింది. [more]
పవన్ కళ్యాణ్ సినిమా నటుడిగానే ఇప్పటికీ ఫేమస్. ఆయన రాజకీయం అయిదేళ్ళకే తేలిపోయింది. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన తాజా ఎన్నికల్లో దారుణమైన ఫలితాలను నమోదు చేసింది. [more]

పవన్ కళ్యాణ్ సినిమా నటుడిగానే ఇప్పటికీ ఫేమస్. ఆయన రాజకీయం అయిదేళ్ళకే తేలిపోయింది. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన తాజా ఎన్నికల్లో దారుణమైన ఫలితాలను నమోదు చేసింది. పార్టీలో ఉన్న వారు సైతం ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు. పవన్ కల్యాణ్ సైతం పార్టీని పక్కన పెట్టి ఎన్జీవో ప్రతినిధిగా మారిపోయారని సెటైర్లు కూడా పడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీలో పవన్ కల్యాణ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి రాజకీయంగా లేదని అంతా అనుకుంటున్న మాట. ఐతే పవన్ కల్యాణ్ పార్టీ వరకూ మాత్రమే ఇది చెప్పుకోవాలి. సినీ నటుడిగా బలమైన సామాజికవర్గం నాయకుడిగా పవన్ కల్యాణ్ తాను ఎటువైపు నిలబడితే ఆ వైపు ఉన్న పార్టీకి మొగ్గు తీసుకురాగలడని 2014 ఎన్నికలో రుజువు అయింది. పవన్ కల్యాణ్ తానుగా పార్టీ పెట్టి గెలవకపోయినా మరో పార్టీకి మద్దతుగా ఉంటూ గెలిపించగలరన్న ఆశలు ఇంకా టీడీపీలో బీజేపీలో ఉన్నాయి.
సమీకరణలే వ్యూహమా..?
ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వైఎస్ జగన్ 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారని కూడా అంటున్నారు. ఆయన పధకాల హడావుడి, రాజకీయ దూకుడు అన్నీ కూడా వచ్చే ఎన్నికల కోసమేనని అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ జగన్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దాంతో ఆయన పవన్ కల్యాణ్ కనుక ఎప్పటిమాదిరిగా టీడీపీ, బీజేపీలతో చేయి కలిపితే 2014 నాటి పరిస్థితులు ఎదురవుతాయా అన్న ఆలోచనతో ఉన్నారని అంటున్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవితో స్నేహానికి చేతులు చాచుతున్నారని చెబుతున్నారు. చిరంజీవి సైరా సినిమాకు అదనపు షోలకు అనుమతి ఇవ్వడం, మర్యాదపూర్వకంగా కలవాలని అపాయింట్మెంట్ అడిగితే ఏకంగా విందు భోజనం పెట్టడం, గుమ్మం దాకా వచ్చి మరీ సాగనంపడం వంటివి చూసినపుడు చిరంజీవికి జగన్ ఇస్తున్న విలువ ఏంటో తెలుస్తుంది.
జగనే హీరో…..
నిజానికి రాజకీయాలు, సమీకరణలు ఎలా ఉన్నా జగన్ పొలిటికల్ బాహుబలి అని ప్రత్యర్ధులు సైతం అంగీకరిస్తారు. జగన్ ఒక్కడూ ఓ వైపు ఉంటే ప్రత్యర్ధులు ఎందరు కలిసినా ఆయన్ని ఢీ కొట్టలేరని కూడా అంటారు. జగన్ కొత్తగా పార్టీ పెట్టినా కూడా 2014 ఎన్నికల్లో ఒంటరి పోరుకే మొగ్గు చూపారు. 2019లో కూడా భీకరమైన పోరుని ఒంటరిగానే ఎదుర్కొని బంపర్ విక్టరీ కొట్టారు. అటువంటి జగన్ కి వేరే వారు మద్దతు అవసరమా అన్న చర్చ సాగుతోంది. పైగా చిరంజీవి సినిమా రంగం వరకూ మెగాస్టార్, పవన్ కల్యాణ్ సైతం వెండితెర పవర్ స్టార్, రాజకీయాల్లో మాత్రం జగన్ ఇపుడున్న వారందరికంటే కూడా ఎన్నో మెట్లు పైన ఉన్నారు. అందువల్ల జగన్ తన ఇమేజ్ ని తగ్గించుకోనక్కరలేదన్న మాట వినిపిసోంది.
మర్యాదకోసమేనా….?
పెద్దమనిషిగా, సినీ సెలిబ్రిటీగా మెగాస్టార్ కి మర్యాదను ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ మెగా ఫ్యామిలీతో రాజకీయంగా సమీకరణలు మారుతాయి, మేలు జరుగుతుందని భావిస్తే మాత్రం పొరపాటేనని కూడా విశ్లేషకులు అంటున్నారు. అలా కనుక జగన్ ఆలోచించినట్లైతే కచ్చితంగా పవన్ కల్యాణ్ కి భయపడినట్లేనని కూడా అంటున్నారు. అయితే జగన్ మనస్తత్వం ఎరిగిన వారు మాత్రం చిరుతో ఫార్మల్ మీటింగ్ తప్ప మరేం కాదని, రాజకీయంగా ఒంటి చేత్తో ఎవరినైనా ఎదిరించే సత్తా జగన్ సొంతం అని అంటున్నారు. చూడాలి మరి ఈ భేటీ పరిణామాలు ఏ వైపు దారితీస్తాయో మరి.

