ఆ ఒక్కరూ ఎవరు…?
రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. అప్పుడు మరొకొందరికి అవకాశమిస్తానన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు పదవుల కోసం పోటీ పెంచినట్లయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో [more]
రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. అప్పుడు మరొకొందరికి అవకాశమిస్తానన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు పదవుల కోసం పోటీ పెంచినట్లయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో [more]

రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. అప్పుడు మరొకొందరికి అవకాశమిస్తానన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు పదవుల కోసం పోటీ పెంచినట్లయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నిక. అయితే మూడు ఎమ్మెల్సీల్లో రెండు పేర్లను ఇప్పటికే వైఎస్ జగన్ ఖరారు చేయడంతో ఆ ఒక్కరూ ఎవరన్న చర్చ పార్టీలో జరుగుతుంది.
ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడంతో…..
ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగబోతోంది. అందులో రెండు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీివి కాగా, ఒకటి తెలుగుదేశం పార్టీ గతంలో ప్రాతినిధ్యం వహించినవి. వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్న ఆళ్లనాని, కోలగట్ల వీరభద్రస్వామికి వైఎస్ జగన్ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడం, తెలుగుదేశం ఎమ్మెల్సీ కరణం బలరాంలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది.
మూడూ వైసీపీకే…..
అయితే మూడు ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. సంఖ్యాబలం ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పెరిగింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ పేరును వైఎస్ జగన్ ఖారారు చేయాల్సిన పరిస్థితి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోపిదేవి ఆరు నెలల్లోగా చట్టసభకు ఎంపిక కావాల్సి ఉంది. రెండో పేరు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ పై పోటీ చేసిన మహ్మద్ ఇక్బాల్ పేరు ఖరారయినట్లు తెలుస్తోంది.
ఆ రెండింటిలో ఒకరికే…..
ఒకటి బీసీ, మరొకటి మైనారిటీ కోటాకు కేటాయించడంతో అధికార వైసీపీలో పదవుల కోసం సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. రెండున్నరేళ్ల తర్వాత వైఎస్ జగన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు ప్రకటించడంతో పోటీ మరింత పెరిగింది. తమకు గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఆ ఒక్క సీటు రెడ్డి సామాజిక వర్గానికి దక్కుతుందా? లేక కమ్మ సామాజికవర్గానికి ఇస్తారా? అన్నది సస్పెన్స్ గా ఉంది. కమ్మ సామాజిక వర్గం నుంచి ఇస్తే మర్రి రాజశేఖర్ పేరు ఖరారయినట్లే. అయితే రెడ్డి సామాజికవర్గం నుంచి ఇవ్వాలనుకుంటే మాత్రం వైఎస్ జగన్ కు తలనొప్పి తప్పదు. ఎందుకంటే ఈ సామాజికవర్గం నుంచి సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. మరి ఆ ఒక్కరూ ఎవరన్నదే ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ అయింది.

