ఇందులో మాత్రం జగన్ పక్కా ఫెయిలేనట…!
ఏపీకి జల జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ చేస్తున్న వ్యూహాలు ఫెయిల్ అవుతున్నాయా ? ఎన్నికల సమయంలో పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఇచ్చిన [more]
ఏపీకి జల జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ చేస్తున్న వ్యూహాలు ఫెయిల్ అవుతున్నాయా ? ఎన్నికల సమయంలో పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఇచ్చిన [more]

ఏపీకి జల జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ చేస్తున్న వ్యూహాలు ఫెయిల్ అవుతున్నాయా ? ఎన్నికల సమయంలో పోలవరం ప్రాజెక్టుపై జగన్ ఇచ్చిన హామీలు నెరవేరే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు హయాంలోనూ పోలవరం షో బాగానే జరిగింది. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని.. సమీక్షలు, పర్యటనల పేరుతో హడావుడి చేసిన చంద్రబాబు.. 2018 డిసెంబరుకల్లా.. పోలవరం పూర్తవుతుందని, నీళ్లు పారిస్తామని చెప్పారు. తర్వాత దానిని ఎన్నికల ముందుకు మార్చారు. మొత్తానికి ఎన్నికలు అయ్యే వరకు పోలవరం ప్రధాన సబ్జెక్ట్ గా మారింది.
ముందుకు వెళ్లడం లేదే…..
ఇక, అధికారం చేపట్టిన జగన్కు కూడా పోలవరం పరీక్షగానే మారింది. ఎట్టి పరిస్థితిలోనూ 2021లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఎప్పటికప్పుడు హామీలు గుప్పిస్తూనే ఉన్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పోలవరంపై సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఎక్కడా ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదు. ప్రధానంగా నిధుల పరిస్థితి దారుణంగా ఉంది. జగన్ సర్కారు దగ్గర పోలవరం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు కూడా లేవు. పైగా, ఇది కేంద్ర ప్రాజెక్టు కావడంతో రాష్ట్రం చేసిన ఖర్చును తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది.
కేంద్రంపైనే ఆధారపడి…..
అయితే, ఇప్పటి వరకు కూడా కేంద్రం డబ్బులు ఎప్పటికప్పుడు ఇవ్వడం లేదనేది బాబు హయాం నుంచి కూడా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టును 2021 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని, పనులు నిరాటంకంగా కొనసాగేందుకు తక్షణమే రూ.15 వేల కోట్లు మంజూరు చేయాలని తాజాగా జగన్ అభ్యర్థించడం గమనార్హం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన రూ.3,805.62 కోట్లను రీయింబర్స్మెంట్ చేయాలని కోరారు. నాబార్డు నుంచి కేంద్రం తీసుకుంటున్న రుణాన్ని నేరుగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కు బదలాయించేలా చర్యలు తీసుకోవాలని తాజాగా కోరడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ప్లీజ్ అంటే వస్తాయా?
ఎందుకంటే.. ఇప్పటికే ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదు. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. కానీ, జగన్ మాత్రం రాష్ట్ర విషయంలో కేంద్రాన్ని ప్లీజ్.. ప్లీజ్.. అంటూ ప్రాధేయపడతానని చెబుతున్నారు. మరి ఈ ప్లీజులు.. అధికారమనే ఫీజులు లేపేస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
