ఈసారి ఛాన్స్ మిస్సయితే.. ఇక అంతేనా?
ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక చూసుకుంటే తెలంగాణాలో కేసీఆర్ రూపంలో కొత్త నాయకత్వం వచ్చింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే కుమారుడు కేటీయార్ అందుకు వచ్చాడు. అన్నీ [more]
ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక చూసుకుంటే తెలంగాణాలో కేసీఆర్ రూపంలో కొత్త నాయకత్వం వచ్చింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే కుమారుడు కేటీయార్ అందుకు వచ్చాడు. అన్నీ [more]

ఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక చూసుకుంటే తెలంగాణాలో కేసీఆర్ రూపంలో కొత్త నాయకత్వం వచ్చింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే కుమారుడు కేటీయార్ అందుకు వచ్చాడు. అన్నీ అనుకూలిస్తే ఆయన కూడా రేపో మాపో సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉన్నారు. బీజేపీ కూడా దూకుడు చేస్తోంది. మజ్లీస్ వంటి పార్టీలు ఉన్నాయి. మొత్తానికి చూస్తే అక్కడ కొంత రాజకీయం బాగానే సాగుతోంది. కానీ ఏపీలో పూర్తిగా చిత్రమైన పరిస్థితి ఉంది.
రెండే ఫ్యామిలీలు…
ఏపీలో రెండు కులాలు, రెండే ఫ్యామిలీలు అన్నట్లుగా రాజకీయం పూర్తిగా బిగుసుకుపోయింది. అయితే జగన్ లేక పోతే నారా వారు అన్నట్లుగా రాజకీయాన్ని నిలువునా విభజించేశారు. జనాలు కోరి చేసుకున్నారో లేక పార్టీల మీద అధినేతల వ్యామోహమో తెలియదు కానీ ఏపీలో చూస్తే సీన్ అలా ఉంది. జగన్ ఇపుడు సీఎంగా ఉన్నారు. ఆయన యువ నేతగా తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా ఓకే లేకపోయినా ఓకే అన్నట్లుగా జగన్ పొలిటికల్ కెరీర్ ఉంది. ఆయనే మరోసారి సీఎం అని ఇప్పటికైతే వినిపిస్తున్న మాట. మరి ఇలాగే జరిగితే ఏపీలో కొత్త రాజకీయానికి చోటు ఉంటుందా అన్నదే చర్చ.
ఒక్క చాన్సే ….
2019 ఎన్నికల్లో జగన్ ఒక్క చాన్స్ అడిగారు కాబట్టి జనం సానుభూతితో ఇచ్చారు అన్నది చంద్రబాబు లాజిక్. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఆ ఒకే ఒక్క చాన్స్ చంద్రబాబుది అవుతోంది. ఆయన రేపటి ఎన్నికల్లో తనకు ఒకే ఒక్క చాన్స్ ఇమ్మని జనాలను అడగాల్సి ఉంటుందేమో. ఎందుకంటే జమిలి ఎన్నికలు వచ్చినా చంద్రబాబుకు 74 ఏళ్ళు వచ్చేస్తాయి. రాకపోతే 75 ఏళ్ళు నిండుతాయి. అధికారంలోకి బాబు వస్తే ఆ ఏజ్ లో కూడా కొన్నాళ్ళు చక్రం తిప్పగలరు. కానీ పొరపాటున పవర్ దక్కపోతే మాత్రం చంద్రబాబుతో పాటు ఆయన టీడీపీకీ అదే చివరి చాన్స్ అవుతుంది అన్నది ఒక విశ్లేషణగా ఉంది.
మరో రెండు ఎన్నికల వరకూ…..
ఇక మరోసారి చంద్రబాబుని ఓడించి పూర్తిగా వైరి పక్షం లేకుండా చేసుకుందామని పక్కా ప్లాన్ లో జగన్ ఉన్నారు. జగన్ అడుగులు ఆలోచనలు అదే దిశగా దూకుడుగా సాగుతున్నాయి. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఆయన్ని కదపడం బ్రహ్మ తరం కూడా కాదేమో. ఆయన మరో రెండు టెర్ములు అంటే 2034 వరకూ కూడా అధికారంలో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని లెక్కలు వేస్తున్న వారూ ఉన్నారు. ఎందుకంటే ఏపీలో కొత్త రాజకీయ నాయకత్వం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడంలేదు.
పదినుంచి పదిహేనేళ్లు…..
జగన్ ని ఢీ కొట్టి నిలిచే చంద్రబాబు పూర్తిగా తెరచాటుకు వెళ్ళిపోతే మళ్ళీ ఆ స్థాయి నాయకత్వం పుట్టడానికి జగన్ని ఢీ కొట్టడానికి కచ్చితంగా పది నుంచి పదిహేనేళ్ళు పడుతుంది అంటున్నారు. మొత్తానికి ఏపీలో రెండు పార్టీల రాజకీయం కాస్తా మరో ఎన్నికల నాటికి ఏకపక్షంగా మారుతుంది అంటున్న వారూ ఉన్నారు. అపుడు చిన్నా చితకా పార్టీలే తప్ప జగన్ కి పోటీ లేని స్థితి ఉంటుందేమో. ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యంలో ఇలాంటివి వాంచనీయం కాదు కానీ ఏపీలో గడచిన రెండు దశాబ్దాలుగా చూసుకుంటే కొత్త రాజకీయ నాయకత్వం పుట్టకపోవడమే దీనికి కారణం అని చెప్పాలి మరి.

