మౌనం దేనికి అర్థం…?
ప్రభుత్వంలో ఉన్న నాయకులు తమపై విమర్శలు వస్తే.. వెంటనే స్పందించి కౌంటర్లు ఇవ్వడం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాల వరకు కూడా జరిగేదే. [more]
ప్రభుత్వంలో ఉన్న నాయకులు తమపై విమర్శలు వస్తే.. వెంటనే స్పందించి కౌంటర్లు ఇవ్వడం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాల వరకు కూడా జరిగేదే. [more]

ప్రభుత్వంలో ఉన్న నాయకులు తమపై విమర్శలు వస్తే.. వెంటనే స్పందించి కౌంటర్లు ఇవ్వడం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాల వరకు కూడా జరిగేదే. తమపై వచ్చే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ ముందుకు సాగుతుండడం మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు ఏపీలో మాత్రం వైసీపీ నేతలు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు సహా ప్రజల నుంచి ఎదురవుతున్న విమర్శల హోరును లెక్కచేయడం లేదు. ఐదేళ్లపాటు ఏం జరిగినా.. తమకు ఏమవుతుందనే భరోసానా? లేక ఆయా విమర్శల్లో పసలేదని పట్టించుకోవడం లేదా? అనేది చర్చనీయాం శంగా మారింది.
కౌంటర్ ఇచ్చేందుకు…..
నిజానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి ఎక్కువ మంది ఫైర్ బ్రాండ్లు ఉన్నారు. మాస్ పదజాలంతో విరుచుకుపడడంలో దిట్టలు కూడా వైసీపీకి సొంతం. అలాంటి వారు ఇప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై నోరు మెదపడం లేదు. ముఖ్యంగా మంత్రులుగా ఉన్నవారిలో చంద్రబాబుపై నిత్యం విమర్శలు సంధించి, మీడియాలో సంచలనం సృష్టించిన కొడాలి నాని కూడా మౌనంగానే ఉండి పోవడం ఆశ్చర్యానికి దారితీస్తోంది. పోలవరం రివర్స్ టెండర్లు, అమరావతి ప్రాజెక్టు, అన్న క్యాంటీన్లు సహా అనేక విషయాలపై విమర్శలు చేస్తున్నారు టీడీపీ నాయకులు. అయితే, వీరికి సరైనకౌంటర్ ఇచ్చేందుకు, ప్రతిపక్షాలకు ముకుతాడు వేసేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా సాహసించడం లేదు.
గట్టిగా విమర్శిస్తున్నా….
ఇక, బొత్స, మంత్రి అనిల్ కుమార్ వంటివారు కూడా ఫైర్ బ్రాండ్లే అయినా.. వారు ఏం మాట్లాడితే.. ఏ వివాదం తెరమీదకి వస్తుందోననే భయం కూడా పార్టీని వెంటాడుతోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన మేకతోటి సుచచిత, పుష్ప శ్రీవాణి వంటి వారు కూడా విధాన పరమైన విషయాలపైనా మాట్లాడక పోవడం దేనికి సంతేకమనే సందేహం వ్యక్తం అవుతోంది. జగన్ అమెరికా పర్యటనలో దాదాపు పది రోజులు ఉన్నారు. ఆ సమయంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా కూడా ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.
బీజీగా ఉండటం వల్లనేనా?
మరి వీరికి సరైన కౌంటర్ ఇచ్చే సామర్ధ్యం ఉన్న రోజా వంటి వారు కూడా మౌనంగా ఉండడంతో ప్రభుత్వ పనుల్లో వీరు బిజీగా ఉన్నారని అనుకోవాలా? లేక.. పసలేని విమర్శలపై స్పందించి ప్రతిపక్షానికి ప్రాధాన్యం పెంచడం ఎందుకులే! అనుకున్నారా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. రోజులు గడిస్తేనే తప్ప వీటికి సమాధానం లభించదు.
