రా అంటున్న రాజకీయం.. ఆ పాపం వైసీపీదేనట
దేశమంతా కరోనా గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఏపీలో మాత్రం అంతా రాజకీయాలే చేస్తున్నారు. నిన్నటి వరకూ విపక్షాలు ప్రభుత్వానికి సహకరించడం లేదని మేధావులు, తటస్థులు కూడా కొంతవరకూ [more]
దేశమంతా కరోనా గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఏపీలో మాత్రం అంతా రాజకీయాలే చేస్తున్నారు. నిన్నటి వరకూ విపక్షాలు ప్రభుత్వానికి సహకరించడం లేదని మేధావులు, తటస్థులు కూడా కొంతవరకూ [more]

దేశమంతా కరోనా గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఏపీలో మాత్రం అంతా రాజకీయాలే చేస్తున్నారు. నిన్నటి వరకూ విపక్షాలు ప్రభుత్వానికి సహకరించడం లేదని మేధావులు, తటస్థులు కూడా కొంతవరకూ నిష్టూరంగా మాట్లాడారు. కానీ ఇపుడు అదే అధికార పక్షం రాజకీయాన్ని తెర తీసి రా రమ్మంటోంది. అంటే కరోనా వైరస్ మహమ్మారి ఉన్నా కూడా రొటీన్ రాజకీయాలే మాకు కావాలి అని అటు అధికార పక్షమే సవాల్ చేసాక ఇక ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరకుండా ఉంటుందా?
ఏలికలే అలా…
నిజానికి విపక్షానికి బాధ్యత తక్కువ. వారు ఏమైనా అంటారు. పాలకుల దృష్టిని ఏమార్చడానికి ఎన్ని రకాలైన విమర్శలు అయినా చేస్తారు అందులో అన్నీ పనికి రావాలని లేదు. ఇపుడు రాజకీయాలు బాగా ముదిరిపోయాక ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సహకారం ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. కానీ అధికార పక్షం తీరు అలా ఉండకూడదు. ఎందుకంటే ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నుకున్న ప్రభుత్వం అది. వారికి పూర్తి బాధ్యత ఉంటుంది. పరిస్థితులు గాడి తప్పకుండా కనీసం తమ వైపు నుంచి అయినా చూసుకోవాలి. కానీ ఏపీలో మాత్రం పాలక పక్షం కూడా రాజకీయ రచ్చకు తానే సై అనేలా పరిస్థితులను కల్పిస్తోంది.
అవసరమా…?
ఇపుడున్న సమయంలో సర్కార్ పూర్తి ఆలోచనలు అన్నీ కరోనా వైరస్ కట్టడికే ఉపయోగించాలి. మొత్తం యంత్రాంగాన్ని కూడా అటువైపు నిమగ్నం అయ్యేలా చూసుకోవాలి. మధ్యలో డైవర్షన్లు ఉంటే అధికార యంత్రాంగం కూడా పెద్దగా శ్రధ్ధను పెట్టదు. అపుడు పై నుంచి ఎంతలా అదమాయించినా కూడా క్షేత్ర స్థాయిలో అనుకున్న తీరున పని జరగదు. అందువల్ల తాము పూర్తిగా యుధ్ధ ప్రాతిపదికన సంసిధ్ధంగా ఉన్నామన్న సందేశం నిరంతరం పై నుంచి అందుతూ ఉండాలి. ఇపుడు చూస్తే పాలకులే పెద్ద డైవర్షన్ తీసుకున్నట్లుగా ఉంది. వారే ఇతర విషయాలపైన ఆసక్తిని కలిగినట్లుగా చెప్పుకుంటున్నారు. అందులో భాగంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీచ్యుతిగా పేర్కొనాలి. మరి అక్కడ సీరియస్ నెస్ తగ్గిందన్న సంకేతాలు దిగువ స్థాయిలి అందితే కరోనా మహమ్మారితో పోరాడేందుకు అధికార యంత్రాంగం ఉత్సాహంగా కదలగలదా.
విపక్షం రెడీ…..
ఇపుడు ఎటువంటి శషబిషలు లేకుండా విపక్షం ప్రభుత్వం పైన విమర్శలకు దిగిపోవడం ఖాయం. ఇంతవరకూ కరోనా వైరస్ రాజకీయాన్ని కొనసాగిస్తున్నా ఎక్కడో కాసింత బెరుకు, ముసుగు విపక్షానికి ఉండేవి. ఇపుడు ఎటూ అధికార పక్షమే వాటిని తొలగించేశాక ప్రతిపక్షానికి అడ్డేముంటుంది. దాంతో వారు యధేచ్చగా శరసంధానం చేస్తారు. మరింతగా ముదిరి కొత్త రాజకీయ బాణాలు వేస్తారు. వాటికి ప్రతిస్పందిస్తూ అధికార పక్షమూ బిజీగా ఉండాలిక. మొత్తానికి కరోనా వైరస్ కంటే కూడా పొలిటికల్ వైరస్ పదింతలు ఏపీలో ముదిరితే మాత్రం ఆ పాపం వైసీపీదేనని చెప్పకతప్పదేమో.

