Sat Dec 06 2025 08:30:56 GMT+0000 (Coordinated Universal Time)
వెంకయ్యపై షా ప్రశంసలు
వెంకయ్యనాయుడు ఏ పదవిలో ఉన్నా వన్నె తెచ్చారని అమిత్ షా అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు

వెంకయ్యనాయుడు ఏ పదవిలో ఉన్నా వన్నె తెచ్చారని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా అన్నారు. నెల్లూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ట్రస్ట్ ద్వారా పేదలకు అనేక రకమైన సేవలందించడాన్ని అమిత్ షా అభినందించారు. దేశాభివృద్ధిలో గ్రామీణప్రాంతాలను భాగస్వామ్యులను చేయడం ఈ ట్రస్ట్ ప్రధాన ఉద్దేశ్యమని అమిత్ షా అన్నారు. దేశంలో బీజేపీ బలోపేతం కావడానికి వెంకయ్య నాయుడు ముఖ్య కారణమన్నారు.
క్రమ శిక్షణకు మారుపేరు...
వెంకయ్య నాయుడు క్రమశిక్షణకు మారుపేరని అమిత్ షా కొనియాడారు. ఆయన విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకున్నారని అమిత్ షా తెలిపారు. నాలుగు సార్లు రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహించారన్నారు. వెంకయ్యనాయుడు భవిష్యత్ లో మరిన్ని పదవులను అధిష్టించాలని ఆకాంక్షించారు.
Next Story

