మరో ఇద్దరు రెడీ అయిపోయారు.. ముహూర్తమే…?
రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఏపీలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అటు సీఎం జగన్, ఇటుప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు [more]
రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఏపీలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అటు సీఎం జగన్, ఇటుప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు [more]

రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఏపీలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అటు సీఎం జగన్, ఇటుప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తనకు అవసరం లేకున్నా.. జగన్.. టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను తన చెంతకు చేర్చుకున్నారు. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
ఉత్తరాంధ్రకు చెందిన…..
కొద్ది రోజులుగా పరిణామాలు గమనిస్తే జగన్ టార్గెట్ అంతా ఉత్తరాంధ్ర మీదే ఉంది. ఎలాగూ సీమతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తనకు అనుకూలంగానే ఉంటాయి. ఇక కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల మీద ఆశల్లేకపోయినా ( భవిష్యత్తులో కమ్మ, కాపులతో గ్యాప్ వచ్చినా) ఉత్తరాంధ్రను తిప్పేసుకుంటూ తన సీఎం పీఠానికి ఢోకా ఉండదన్నదే జగన్ ప్లాన్. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూటమి కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీని వీడనున్నారనే ప్రచారం సాగుతోంది.
వర్షాకాల సమావేశాలకు ముందు….
అయితే, వీరిరాకను స్వయంగా జగనే వద్దని అంటున్నట్టు వైసీపీనేతల మధ్య చర్చ నడుస్తోంది. నిజానికి టీడీపీని మరింత బలహీనం చేయడం ఒక ఉద్దేశమైతే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబుకు ఉన్న గౌరవాన్ని తుడిచిపెట్టాలనేది మరోవ్యూహం. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు టీడీపీ నుంచి జంపింగులను ప్రోత్సహిస్తున్నారు. ఇద్దరు నేతలు వచ్చేందుకు రెడీ అయ్యారు. కానీ, వీరిని ఇప్పటికిప్పుడు పార్టీలోకి తీసుకునేందుకు జగన్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. వర్షాకాల సమావేశాలను నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలూ రెడీ అవుతున్నాయి.
టీడీపీకి షాక్ ఇవ్వాలని….
ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ కూడా రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ఒక రోజు ముందు లేదంటే.. సమావేశాలు జరుగున్న సమయంలోనో వారిని చేర్చుకోవడం ద్వారా టీడీపీ అధినేతకు షాక్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక, ఈ పరిస్థితిని బాబు ఎలా ఎదుర్కొంటారోనని టీడీపీలోనూ తర్జన భర్జన సాగుతోంది.
