ఈసారి కూడా కష్టమేనటగా
ఆమె టీఆర్ఎస్ పార్టీలో సీనియర్. జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, తెలంగాణ తొలి శాసన సభకు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఈసారైనా సీఎం కేసీఆర్ కేబినెట్లో స్థానం దక్కుతుందన్న నమ్మకంతో [more]
ఆమె టీఆర్ఎస్ పార్టీలో సీనియర్. జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, తెలంగాణ తొలి శాసన సభకు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఈసారైనా సీఎం కేసీఆర్ కేబినెట్లో స్థానం దక్కుతుందన్న నమ్మకంతో [more]

ఆమె టీఆర్ఎస్ పార్టీలో సీనియర్. జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, తెలంగాణ తొలి శాసన సభకు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఈసారైనా సీఎం కేసీఆర్ కేబినెట్లో స్థానం దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ.. ఇంతలోనే ఆమెకు ఓ ఎమ్మెల్సీ నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. అనుకోని పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. దీంతో తనకు మంత్రిపదవి దక్కుతుందో.. లేదోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారట. మొదటి కేబినెట్లో స్థానం దక్కకున్నా.. వచ్చే విస్తరణలోనైనా పదవి ఖాయం అనుకుంటున్న తరుణంలో ఆ ఎమ్మెల్సీ నుంచి ఎదురవుతున్న పోటీతో పాపం.. ఆ మహిళా ఎమ్మెల్యే కంటిమీద కునుకులేకుండా ఉంటున్నారట. ఆమే పద్మా దేవేందర్ రెడ్డి.
ఈసారైనా దక్కుతుందని….
సీఎం కేసీఆర్ తొలి ప్రభుత్వంలో మహిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. అయినా.. డిప్యూటీ స్పీకర్ హోదాలో పద్మాదేవేందర్‌రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్‌లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహిళా నేతల్లో మాజీ ఎంపీ, కల్వకుంట కవిత తర్వాత పద్మాదేవేందర్రెడ్డేనని చెప్పొచ్చు. తొలి శాసన సభలో డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగిన పద్మాదేవేందర్‌రెడ్డికి.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కావడం ఖాయమని అనుకున్నారు. కానీ.. మంత్రి వర్గంలో ఆమె స్థానం దక్కలేదు. అయితే మరికొద్ది రోజుల్లో మంత్రివర్గ విస్తరణలోనైనా అవకాశం దక్కుతుందని ఆశగా ఉన్నారు పద్మాదేవేందర్‌రెడ్డి.
ఎమ్మెల్సీ రూపంలో…..
కానీ.. ఇంతలోనే ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి రూపంలో పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయంగా పోటీ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సుభాష్‌రెడ్డి మెదక్ నియోజకవర్గానికి చెందిన వారే. ఆయన సీఎం కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఈ క్రమంలోనే క్రమక్రమంగా మెదక్‌పై ఆయన పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎంపీపీ ఎన్నికలే ఇందుకు నిదర్శనమని పలువురు నాయకులు అంటున్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి స్వంత మండలం హావేలి ఘన్పూర్. ఇక్కడ ఎంపీపీగా, తన అన్న శేరి నారాయణ్ రెడ్డిని ప్రతిపాదిస్తే, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మరో నేత మానిక్రెడ్డిని తెరపైకి తెచ్చారట.
ఊహించని పరిణామంతో….
అయితే.. చివరకు అధిష్ఠానం ఆశీస్సులతో శేరి నారాయణ్ రెడ్డినే హావేలి ఘన్పూర్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇలా ఊహించని పరిణామంతో పద్మాదేవేందర్‌రెడ్డి తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇక నియోజకవర్గ ఎమ్మెల్సీ హోదాలో ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీలో ఆధిపత్య పోరు ఖాయంగానే కనిపిస్తోంది. ఇక సుభాష్‌రెడ్డి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే పద్మాదేవేందర్‌రెడ్డి హరీష్‌రావు వర్గం. సుభాష్‌రెడ్డి కేటీఆర్ వర్గం. భవిష్యత్తులో పద్మాకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో కూడా సుభాష్‌రెడ్డి సామాజిక కోణంలో అడ్డు తగులుతాడా ? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి. నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోతే తీవ్ర నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.