జగన్ రూట్లోకి గంటా బ్యాచ్
తమ్ముళ్ళు చంద్రబాబు మాట వినాలి కదా. వారికి అధినాయకుడు బాబే కదా. కానీ తాము మాత్రం జగన్ ఏం చేస్తే అదే రైట్ అంటున్నారు పసుపు తమ్ముళ్ళు. [more]
తమ్ముళ్ళు చంద్రబాబు మాట వినాలి కదా. వారికి అధినాయకుడు బాబే కదా. కానీ తాము మాత్రం జగన్ ఏం చేస్తే అదే రైట్ అంటున్నారు పసుపు తమ్ముళ్ళు. [more]

తమ్ముళ్ళు చంద్రబాబు మాట వినాలి కదా. వారికి అధినాయకుడు బాబే కదా. కానీ తాము మాత్రం జగన్ ఏం చేస్తే అదే రైట్ అంటున్నారు పసుపు తమ్ముళ్ళు. మూడు రాజధానుల ముచ్చట తెచ్చి ఏపీ రాజకీయాల్లో విపక్షాలకు మాడు పగిలేలా గట్టి షాక్ ఇచ్చేసిన జగన్ ఇపుడు కూల్ గా ఉన్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షం ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు మాత్రం ఆగం ఆగం అవుతున్నారు. ఆయన కలల రాజధాని అమరావతి కళ్ళ ముందే కరిగిపోతోందన్న బాధ ఓ వైపు అయితే సొంత పార్టీ నాయకులు సైతం జగన్ రూట్లోకి వెళ్ళిపోతున్నారన్న బాధ మరోవైపు. దాంతో అమరావతి రాజధాని విషయంలో బాబుది ఒంటరి పోరాటంగా మిగిలిపోతోంది.
విశాఖలో రాజధానికి సై…
విశాఖలో పాలనాపరమైన రాజధాని ఏర్పాటుకు జగన్ ప్రతిపాదించారు. దానికి జై కొడుతూ తాజాగా టీడీపీ తమ్ముళ్ళు ఏకంగా ఒక తీర్మానం చేసి పారేశారు. ఓ వైపు చంద్రబాబు అమరావతి రైతులతో మీటింగులు పెడుతూ ఆందోళనను పెంచుతూంటే తమ్ముళ్ళు మాత్రం ప్రాంతాల వారీగా మా రాజధాని మా ఇష్టం అన్నట్లుగా మాట్లాడుతూ బిగ్ షాక్ ఇచ్చేస్తున్నారు. విశాఖలో తమ్ముళ్ళు మీటింగు పెట్టి మరీ జగన్ కి జై కొట్టేశారు. విశాఖతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృధ్ధి చెందాలంటే ఎగ్జిక్యూటివ్ రాజధాని ఇక్కడే ఉంటాలంటూ తమ్ముళ్ళు అంటున్నారు.
బాబే మారాలట…..
ఇక తమ్ముళ్ళు అమరావతి విషయంలో కూడా సూచనలు చేశారు. అమరావతి రాజధాని అన్నారని, దాని వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం న్యాయమైన పరిష్కారం చూపిస్తే సరిపోతుందని సూచించారు. అంతే తప్ప చంద్రబాబు మాదిరిగా ఆవేశంగా అమరావతి రాజధానిని అక్కడే ఉంచాలని అనలేదు. దాంతో పాటు చంద్రబాబుని తాము ఈ విషయంలో ఒప్పిస్తామని, ఆయన తన వైఖరి మార్చుకోవాలన్నట్లుగా మాట్లాడడం విడ్డూరమే.
గంటా నాయకత్వంలో….
విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురూ ఇప్పటివరకూ ఒక్కసారిగా కలసిన దాఖలాలు లేవు. జగన్ పుణ్యమాని వారంతా గెలిచిన ఏడు నెలల తరువాత ఒక చోట చేరారు. పైగా అందరూ కలసి విశాఖ రాజధానికి ఏకగ్రీవంగా తీర్మానించడం విశేషం. ఇక విశాఖ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ రహమాన్ వస్తే తాను రాను అని చెప్పిన సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైతం మీటింగుకు వచ్చి విశాఖలో రాజధాని ఉండాలని ఓటు వేయడం గమనార్హం. మొత్తానికి గంటా ఒక్కరే కాదు మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు కూడా విశాఖకు జై అనేశారు. లేకపోతే తమ రాజకీయ జీవితం పతనం అవుతుందని వారు కలవరపడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
సిక్కోలు దెబ్బ ….
దీనికి కొంత ముందు సిక్కోలులో కూడా ఇదే సీన్ కనిపించింది. అమరావతి రాజధానికి అనుకూలంగా తీర్మానం చేయాలని బాబుకు సన్నిహితుడైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రయత్నం చేయగా దాన్ని మిగిలిన తమ్ముళ్ళు గట్టిగా తిప్పికొట్టారు. మాజీ మంత్రి కోండ్రు మురళీమోహనరరావు ఈ విషయంలో గట్టిగానే తగులుకున్నారు. ఉత్తరాంధ్ర బాగుపడడానికి రాజధానిని పెడుతూంటే అడ్డుకోవడం ఏంటని ఆయన మండిపడ్డారని టాక్. దాంతో అమరావతికి అనుకూలంగా తీర్మానం చేయలేక సిక్కోలు టీడీపీ నేతలు చేతులెత్తేశారు, ఇండైరెక్ట్ గా విశాఖ రాజధానికి జై కొట్టేశారు.

