బీజేపీ మడి అంతా మట్టికొట్టుకుపోయిందే ?
బీజేపీ నైతిక విలువలకు ఎక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చే పార్టీ అని అంతా అనుకుంటారు. తేడా పార్టీ తమదని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పుకుంటారు కూడా. [more]
బీజేపీ నైతిక విలువలకు ఎక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చే పార్టీ అని అంతా అనుకుంటారు. తేడా పార్టీ తమదని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పుకుంటారు కూడా. [more]

బీజేపీ నైతిక విలువలకు ఎక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చే పార్టీ అని అంతా అనుకుంటారు. తేడా పార్టీ తమదని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పుకుంటారు కూడా. ఒకే ఒక ఓటు తేడాతో వాజ్ పేయి 13 నెలల ప్రధాని పదవికి రాజీనామా చేసిన అరుదైన చరిత్ర ఉన్న పార్టీ బీజేపీ. ఇపుడు ఆ పార్టీ అయారాం గయారం లను ఆకట్టుకుని కుర్చీ మీద ఉన్న ప్రభుత్వాలను కూల్చేసి తాను అధికారంలోకి వస్తోంది. ఇదంతా రాజకీయమే అనుకుంటే ఏ బాధా ఎవరికీ లేదు కానీ బీజేపీ మీద సదభిప్రాయం ఉంది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి బీజేపీని ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి పార్టీ తానూ ఆ తానులో ముక్క అంటూంటేనే ఆశ్చర్యపోతున్నారు.
మైనింగ్ డాన్ అలా…..
ఉత్తరాంధ్రా జిల్లాల్లో మైనింగ్ చాలా దారుణంగా జరుగుతోంది. ఎక్కడా అనుమతులు ఉండవు, ఒక చోట లీజుకు తీసుకుని పది చోట్ల తవ్వేస్తూంటారు. ఎవరూ అడగరు, అడిగిన వారికి మామూళ్లు అందుతాయి. ఈ విధంగా విశాఖ జిల్లాలో ఓ మైనింగ్ డాన్ చాలా ఏళ్ళుగా దందా చేస్తూ వచ్చాడు. ఆయన తెలుగుదేశం సానుభూతిపరుడు. ఆ సామాజికవర్గానికే చెందిన వాడు. అందుకే ఆయన ఆడిందే ఆటగా సాగిపోయింది. వైసీపీ వచ్చాక ఆయన మీద యాక్షన్ మొదలైంది. వందల కోట్ల మేర భారీ జరీమానాలు పడ్డాయి. దాంతో ఆ అవినీతి అనకొండ ఇపుడు బీజేపీలో చేరిపోయాడు.
సోము పక్కనే….
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అంటే నైతిక విలువలకు పెద్ద పీట వేస్తారని చెబుతారు. ఆయన ప్రెసిడెంట్ అయ్యాక తొలిసారి విశాఖ పర్యటనకు వస్తే స్వాగతం పలికింది ఈ మైనింగ్ డానే.. పైగా సోము వీర్రాజు పక్కనే తన ఫోటోలు వేసుకుని ఫ్లెక్సీలు పెట్టి తెగ హడావుడి చేశారు. ఈయనను సోముని ఫోటోల్లో అలా చూసిన బీజేపీ కార్యకర్తలే గతుక్కుమన్నారు. మరి ఆయనకు ఇంతటి అభయహస్తం ఎవరు ఇచ్చారో, పార్టీలోకి రాత్రికి రాత్రే తెచ్చి నాయకుని హోదా ఎలా ఇచ్చారో కమలనాధులే చెప్పాలి.
సేఫే జోన్ గా….
ఏపీలో ఇప్పటికే బీజేపీ మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. అవినీతిపరులు, బ్యాంకులను కొల్లగొట్టిన వారు బీజేపీలో చేరిపోయి సేఫ్ జోన్ లోకి వెళ్ళారని కూడా ప్రచారంలో ఉంది. బీజేపీ బలం పెంచుకోవడం అంటే ఇదేనా అన్న సెటైర్లు పడుతున్నా కమలం పార్టీ పెద్దలు మాత్రం ఈ తరహా నేతలను చేరదీసి మరీ కండువాలు కప్పేస్తున్నారు. మరో వైపు చూస్తే వారిని చూసి స్పూర్తిని పొందిన మిగిలిన అవినీతిపరులు కూడా ఇదే బీజేపీని రాచబాటగా ఎంచుకుంటున్నారు. విశాఖలో ఈ మైనింగ్ డాన్ గురించి తెలియని సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అవినీతిని అంతం చేస్తాం, స్వచ్చమైన పాలన అందించే సత్తా తమ పార్టీకే ఉందని గొప్పలు చెప్పుకున్నారు. మరి మైనింగ్ డాన్ స్వాగతం పలుకుతున్న ఫ్లెక్సీలను చూసిన జనానికి బీజేపీ పెద్ద నోట అవినీతి అంతం అన్న మాటలు వింటే ఏదోలా అనిపించాయంటే తప్పు ఆయనది కాదు, కచ్చితంగా లోకల్ లీడర్లదే. ఇప్పటికైనా విశాఖ కొండలను మింగేసిన మైనింగ్ డాన్ కి తమ పార్టీకి సంబంధం లేదని కమల నాధులు ప్రకటించి పాప ప్రక్షాళన చేసుకోవాలని సొంత కార్యకర్తలే కోరుతున్నారు మరి.

