ఈ అసెంబ్లీలోనే అధ్యక్ష అనాలట ?
అధ్యక్షా అనాలని అందరికీ ఉంటుంది. కానీ అసెంబ్లీ గేటు దాటడమే అతి పెద్ద చిక్కు. ఇపుడు ఆ సరదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కలుగుతోందిట. విభజన [more]
అధ్యక్షా అనాలని అందరికీ ఉంటుంది. కానీ అసెంబ్లీ గేటు దాటడమే అతి పెద్ద చిక్కు. ఇపుడు ఆ సరదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కలుగుతోందిట. విభజన [more]

అధ్యక్షా అనాలని అందరికీ ఉంటుంది. కానీ అసెంబ్లీ గేటు దాటడమే అతి పెద్ద చిక్కు. ఇపుడు ఆ సరదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కలుగుతోందిట. విభజన ఏపీలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి 2019 ఎన్నికలు చుక్కలు చూపించాయి. 0.84 శాతం ఓట్లతో నోటాకు జై కొట్టిన గొప్పతనం బీజేపీది. అయిన ఆశ చావడంలేదు. 2024 వరకూ ఉండలేకపోతోందిట. ఇంకా నాలుగేళ్ళ వరకూ అధికార విరహాన్ని ఓపలేనని అంటోంది. అర్జంటుగా ఈ అసెంబ్లీలోనే కమలం కండువాలు కళకళలాడుతూ కనిపించాలిట.
గోడ దూకుడేగా…?
అర్జంటుగా అంటే అర్ధరాత్రి అడవిలో అయినా అన్నం పుడుతుంది. కానీ దానికి మడీ తడీ ఒదిలేయాలి. మరి తేడాగల పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీకి మడీ ఆచారాలు ఎక్కువే కదా. ఇలాగైతే ఎలా కుదిరేది అన్న డౌట్లు రావచ్చు. కానీ అది అలా అలోచించేవారి వెర్రితనమే అవుతుందేమో. ఇపుడున్నది వాజ్ పేయి, అద్వానీ కాలం నాటి బీజేపీ కాదు, మోడీ, అమిత్ షా లాంటి గండరగండల నాయకత్వంలోని కాషాయదళం. అందువల్ల అర్జంటుగా బీజేపీకి ఏపీలో ఎమ్మెల్యేలను పుట్టించేయగలరు కూడా.
అరడజన్ మందికా…
ఏపీలో తమ టార్గెట్ టీడీపీ అని బీజేపీ కొత్త ప్రెసిడెంట్ సోము వీర్రాజు చెబితే ఏమో అనుకున్నారంతా. అందులో కొంత నిజం కూడా ఉంది. ఏపీలో టీడీపీ లేనపుడు కొన్ని వర్గాల వారికి బీజేపీ వేదికగా ఉండేది. ఆ బలమంతా తరువాత కాలంలో పసుపు పార్టీలోకి పోయింది. ఇక 18 శాతం ఓటింగుని 1998 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ఏపీలో తెచ్చుకుంది. పొత్తులతో అది అంతా చిత్తు అయింది. ఇలా చాలా మంది టీడీపీ నుంచి ఓటు బ్యాంకును కమలం వైపుగా సోము వీర్రాజు మళ్ళిస్తారు, రాజకీయ ఘనాపాటేనని అంచనా వేసుకున్నారు. కానీ సోము మాటలకు అర్ధాలు వేరు అని ఇపుడు తెలుస్తోందిట. కనీసం అరడజన్ మంది టీడీపీ ఎమ్మెల్యేలను అర్జంటుగా బీజేపీలోకి జంప్ చేయించడానికి ఏపీ బీజేపీ ఆరాటపడుతోంది అని ప్రచారం అయితే సాగుతోంది.
ఇక ఇంతేనా…?
నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి చేరాక బీజేపీకి బలం రాజ్యసభ లో పెరిగిందేమో కానీ గ్రౌండ్ లెవెల్లో అలాగే ఉంది. ఇక మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి వంటి వారిని చేర్చుకున్నా ఎన్టీయార్ ఓటు బ్యాంకు ఇటు రాలేదు, కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ ప్రెసిడెంట్ గా చేసినా కాంగ్రెస్ నుంచి ఒక్క శాతం ఓటు కూడా ఇటు షిఫ్ట్ కాలేదు. ఆయన సామాజికవర్గం కూడా కన్నెత్తి చూడలేదు. ఇలా ఫిరాయింపులతో ఇంపూ సొంపూ పార్టీకి రాదని అనేక రుజువులు ఉన్నాయి. అయినా కూడా బీజేపీ ఇంకా పాత మోడల్ లోనే వెళ్తోంది. వైసీపీలో డోర్లు మూసేసిన ఉత్తరాంధ్రా జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తెచ్చేయాలని తెగ తాపత్రయపడుతోంది. వీరు వస్తే ఏపీ అసెంబ్లీలో ఇప్పటికిపుడే బీజేపీ సౌండ్ గట్టిగా వినిపిస్తుంది. ఇది తాత్కాలిక విజయమే అవుతుంది. కానీ 2024 నాటికి మాత్రం బీజేపీ ఈ ఫిరాయింపుల మరకలతో అసలుకే ఎసరు తెచ్చుకుంటుంది అని సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి.

