సెకండ్ వేవ్ స్టార్టయిందట
భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ స్టార్టయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయినప్పటికీ [more]
భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ స్టార్టయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయినప్పటికీ [more]

భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ స్టార్టయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయితే దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయినప్పటికీ మహారాష్ట్రలో మాత్రం సెకండ్ వేవ్ స్టార్టయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకు ఇరవై వేలకు పైగానే కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.
మహారాష్ట్రలో…..
ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది. మహారాష్ట్రలోని ఎనిమిది జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఒక మహారాష్ట్రలోనే రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ తొలి నాళ్ల నుంచి మహారాష్ట్రను వదిలిపెట్టడం లేదు. మహారాష్ట్రలోనే తొలినాళ్లలో కరోనా వైరస్ కేసులు ఎక్కువగా కన్పించాయి. మర్కజ్ మసీద్ ప్రార్థనల నుంచి వచ్చిన వారితో కేసుల సంఖ్య ఇక్కడ మరింత పెరిగింది.
అనేక చోట్ల లాక్ డౌన్ విధించినా….
అయితే మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. పూనే, థానే, నాగపూర్, ముంబయి, అమరావతి వంటి చోట్ల కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడ లాక్ డౌన్ ను విధించింది. రాత్రి వేళ అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలు చేస్తుంది. కాంట్రాక్టు ట్రేసింగ్ సక్రమంగా లేకపోవడం వల్లనే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వైద్య నిపుణుల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా లాక్ డౌన్ ను తొలిగించిన తర్వాత వైరస్ వ్యాప్తి ఎక్కవగా ఉంది.
సరైన పర్యవేక్షణ లేకపోవడంతో….
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం పై కేంద్ర బృందం అధ్యయనం చేసింది. వైరస్ వ్యాప్తిని సక్రమంగా గుర్తించడం లేదని, హోం ఐసొలేషన్ ఉన్న వారికి సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని కేంద్ర బృందం అభిప్రాయపడింది. దీంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మహారాష్ట్రతో పాటు కేరళ, కర్ణాటక, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

