నమ్మలేని నిజాలటగా
ఈ మధ్య కాలంలో బీజేపీ శిబిరంలో విషాదం అలముకుంది. కీలక నేతల వరస మరణాలతో పార్టీ దిగాలైపోతోంది. పార్టీలో నిన్నటి వరకూ కనిపించిన నాయకులు నేడు ప్రాణాలతో [more]
ఈ మధ్య కాలంలో బీజేపీ శిబిరంలో విషాదం అలముకుంది. కీలక నేతల వరస మరణాలతో పార్టీ దిగాలైపోతోంది. పార్టీలో నిన్నటి వరకూ కనిపించిన నాయకులు నేడు ప్రాణాలతో [more]

ఈ మధ్య కాలంలో బీజేపీ శిబిరంలో విషాదం అలముకుంది. కీలక నేతల వరస మరణాలతో పార్టీ దిగాలైపోతోంది. పార్టీలో నిన్నటి వరకూ కనిపించిన నాయకులు నేడు ప్రాణాలతో మిగలడంలేదు. పార్టీకి పట్టుకొమ్మలు దశాబ్దాలుగా పార్టీకి పనిచేస్తూ కాషాయ జెండా దేశంలో ఎగరడానికి కారణమైన వారు ఇలా ప్రాణ రహితంగా మారిపోయి పడమర వైపు జారిపోతున్నారు. దీనికంతంటికీ కారణం ఏంటి అంటే బీజేపీకి చెందిన భొపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ చెప్పిన మాటలు వింటే అర్ధమైపోతుంది. బీజేపీ నాయకుల వరస మరణాల వెనక ప్రతిపక్షాలు ఉన్నాయట. వారి కుట్ర ఫలితంగానే తమ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా వీడిపోతున్నారని ప్రజ్ఞాసింగ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు.
అదే కారణమా..?
ప్రతిపక్షాలు తమ పార్టీ నేతలను చంపడానికి క్షుద్ర పూజలు చేస్తున్నాయని కూడా ప్రజ్ఞాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు బీజేపీని లేకుండా చేయాలని చూస్తున్నాయని, అందుకే ఈ రకమైన క్షుద్ర పూజలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు మహరాజ్ ఓ సందర్భంలో చెప్పారని, అయితే తాను దాన్ని అప్పట్లో నమ్మలేదని ప్రజ్ఞాసింగ్ అన్నారు. ఇపుడు జరిగినది చూస్తూంటే స్వామి మహజార్ చెప్పింది నిజమేననిపిస్తోందని అన్నారు. మొత్తానికి ప్రతిపక్షాల క్షుద్రపూజల ఫలితంగా బీజేపీ నాయకులు చనిపోతున్నారని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ మరోసారి బాగానే నోరు చేసుకున్నారు. ఆమె మాటలు పక్కన పెట్టినా ఏడాది కాలంలో వరసగా బీజేపీ నాయకులను కోల్పోవడం మాత్రం అసాధారణమైన విషయమే.
ఒకేసారి ఒకే వ్యాధితో….
అందరూ దాదాపుగా ఒకే వయసు వారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్నవారు. అంతా తమ స్థాయిల్లో చక్రం తిప్పిన నేతలే. ఒకసారి వారి జాబితా పరిశీలిస్తే ఈ ఏడాది మొదట్లో గోవా ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ మరణించారు. ఆయన క్యాన్సర్ వ్యాధిలో చనిపోయారు. ఇక కర్నాటకకు చెందిన కేంద్ర మంత్రి అనంతకుమార్ సైతం క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. అలాగే తాజాగా చనిపోయిన అరుణ్ జైట్లీ సైతం క్యానర్ బారిన పడ్డారు. ఇక సుష్మ స్వరాజ్ మాత్రం కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతూ మరణించారు. ఇక ఇపుడు బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి సైతం ఆసుపత్రిలో ఉన్నారు. ఎన్నడూ ఇబ్బంది పడని ఎల్కే అద్వాని ఈ మధ్యనే చాలా రోజున పాటు మంచం పట్టారు. ఇక కేంద్రంలో ఉన్న మరో మంత్రి గడ్కరీ చూస్తే తరచూ అనారోగ్యం పాలు అవుతున్నారు. దేశంలో ఒక్క బీజేపీకే ఇలా జరగడం అంటే నిజంగా విడ్డూరమే మరి. కానీ ప్రజ్ఞాసింగ్ మాటలు చూస్తుంటే మూఢమతిలా అన్పించడం లేదూ.

