చివర్లో వచ్చినా రత్న ప్రభ బాగానే దూసుకుపోయారే?
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా రత్నప్రభను అధిష్టానం ప్రకటించింది. అనేక మంది పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరకు రత్న ప్రభ పేరును ఖరారు చేసింది. [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా రత్నప్రభను అధిష్టానం ప్రకటించింది. అనేక మంది పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరకు రత్న ప్రభ పేరును ఖరారు చేసింది. [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా రత్నప్రభను అధిష్టానం ప్రకటించింది. అనేక మంది పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరకు రత్న ప్రభ పేరును ఖరారు చేసింది. అయితే చివరి నిమిషంలో రత్న ప్రభ పేరు ఖరారయినా ఆమె మాత్రం ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. బీజేపీ కంటే వ్యక్తిగా తనను చూడాలని ఆమె పరోక్షంగా ప్రచారాన్ని నిర్వహించారు. తాను సక్సెస్ ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ని అని, నలభై ఏళ్లు అధికారిగా ప్రజాసేవ చేశానని, అనేక అభివృద్థి పనులు చేశానని చెప్పుకొచ్చారు.
ఎంపికపై విమర్శలొచ్చినా…..
నిజానికి రత్న ప్రభ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయితే ఆమె ఎక్కువ కాలం కర్ణాటకలో పనిచేశారు. తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడలేని రత్న ప్రభ ఎంపికపై తొలినాళ్లలో సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపించాయి. కానీ ప్రచారం ముగిసే సమయానికి రత్న ప్రభ ఆ విమర్శలకు చెక్ పెట్టగలిగారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగడంతో అన్ని సామాజికవర్గాలను తన వైపునకు తిప్పుకునేందుకు రత్న ప్రభ ప్రయత్నించారు.
కన్నడ సహకారం…..
రత్న ప్రభకు తిరుపతి ఉప ఎన్నికల్లో కర్ణాటక నుంచి కూడా సహకారం అందిందంటున్నారు. కర్ణాటక బీజేపీ అన్ని రకాలుగా రత్న ప్రభకు పరోక్షంగా సహకరించింది. యడ్యూరప్ప అధికారంలోకి రావడానికి పరోక్షంగా సహకరించడంతో కర్ణాటక బీజేపీ తిరుపతిలో అండగా నిలిచిందంటున్నారు. మిగిలిన అభ్యర్థులు కేవలం పార్టీ గుర్తు, ఆ పార్టీ అధినేతల ఇమేజ్ పైనే ఆధారపడి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఓడినా భవిష్యత్…..
కానీ రత్న ప్రభ మాత్రం తాను రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా కాకుండా ఫక్తు పొలిటీషియన్ గా వ్యవహరించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు అవకాశాలు తక్కువని రత్న ప్రభకు తెలియంది కాదు. కానీ ఆమెకు జాతీయ నాయకత్వం నుంచి పూర్తి స్థాయి భరోసా లభించడంతోనే ఎన్నికల గోదాలోకి దిగారంటున్నారు. మొత్తం మీద రత్న ప్రభ తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమి చెందినా భవిష్యత్ లో బీజేపీలో కీలక నేతగా మారతారన్నది మాత్రం వాస్తవం. ఆమె వెనక కన్నడ లాబీయింగ్ పనిచేస్తుంది.