రత్న ప్రభ నుంచి ఆ నివేదికను కోరారా?
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల విషయంలో ఆ పార్టీ అభ్యర్థి రత్న ప్రభ తీవ్ర అసంతృప్తిిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కనీస ఓట్లను కూడా సాధించక పోవడం [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల విషయంలో ఆ పార్టీ అభ్యర్థి రత్న ప్రభ తీవ్ర అసంతృప్తిిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కనీస ఓట్లను కూడా సాధించక పోవడం [more]

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల విషయంలో ఆ పార్టీ అభ్యర్థి రత్న ప్రభ తీవ్ర అసంతృప్తిిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కనీస ఓట్లను కూడా సాధించక పోవడం వెనక నేతల వైఫల్యమే కారణమని రత్న ప్రభ భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర నాయకత్వానికి ఆమె నివేదిక పంపినట్లు సమాచారం. తనకు పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి పెద్దగా సహకారం అందలేదని, సమన్వయం కొరవడిందని రత్న ప్రభ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
పెద్ద ఆశలే పెట్టుకుని…..
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఆశలే పెట్టుకుంది. అందుకే ఆచితూచి అభ్యర్థి ఎంపికలోనూ అడుగులు వేసింది. సుదీర్ఘ మంతనాల తర్వాత రత్న ప్రభను ఎంపిక చేసింది. తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని భావించిన బీజేపీ తమకు ఈసారి గెలవకపోయినా సెకండ్ ప్లేస్ లో ఉంటామని ఆశించింది. ఈ మేరకు దాదాపు నాలుగు నెలల ముందునుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.
నేతల మధ్య సమన్వయం లేదని….
తిరుపతి ఉప ఎన్నికను సీనియర్ నేత సునీల్ దేవ్ ధర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన రత్నప్రభ ఎంపికలోనూ ఆయనే కీలక పాత్ర పోషించారు. అయితే నేతలు కేవలం మీడియాకు మాత్రమే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోయారని రత్న ప్రభ భావిస్తున్నారు. నేతలందరూ తిరుపతి చుట్టూ తిరిగారని, కీలకమైన నియోజకవర్గాలను విస్మరించారంటున్నారు.
అదే ధీమాతో…?
జనసేన పార్టీతో పొత్తు ఉండటంతో కనీస ఓట్లు సాధిస్తామన్న నమ్మకం పెట్టుకున్నారు. అందుకే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తిరుపతి ప్రచారానికి వచ్చిన జేపీ నడ్డా సయితం నేతల మధ్య సమన్వయం లేకపోవడాన్ని గుర్తించి వారిని మందలించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా యే స్వయంగా రత్న ప్రభను ఓటమికి గల కారణాలను తెలపాలని కోరినట్లు తెలిసింది. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నికలో దారుణ ఓటమి బీజేపీ నేతల భవిష్యత్ కు ఇబ్బందికరంగా మారనుంది.

