విశాఖలో బాబు మీద పోలీస్ కేసు….
మాటకొస్తే జైలుకు పోతానంటున్నారు చంద్రబాబు ఈ మధ్య. ఆయనకు ఎందుకో జైళ్ళ మీద ప్రేమ పుట్టిందా, లేక అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందన్న ఆశ పుట్టిందా అన్నది [more]
మాటకొస్తే జైలుకు పోతానంటున్నారు చంద్రబాబు ఈ మధ్య. ఆయనకు ఎందుకో జైళ్ళ మీద ప్రేమ పుట్టిందా, లేక అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందన్న ఆశ పుట్టిందా అన్నది [more]
మాటకొస్తే జైలుకు పోతానంటున్నారు చంద్రబాబు ఈ మధ్య. ఆయనకు ఎందుకో జైళ్ళ మీద ప్రేమ పుట్టిందా, లేక అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందన్న ఆశ పుట్టిందా అన్నది పక్కన పెడితే చంద్రబాబు మాత్రం ఎక్కువగా జైలు జపం చేస్తున్నారు, తనను జైళ్ళో పెట్టినా సరే పోరాటం ఆపనంటున్నారు. అమరావతి రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని, వైసీపీ సర్కార్ కి దమ్ముంటే ముందు తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండని చాలెంజ్ చేస్తున్నారు. తనకు రైతులు ముఖ్యం కానీ తన జీవితం కానే కాదని కూడా బాబు భారీ ప్రకటనలు ఇస్తున్నారు. తాను ఏ పోలీసుకూ భయపడనని, అమాయక రైతులను అరెస్ట్ చేసే బదులు తనను వేయండి సంకెళ్ళు అంటూ కవ్విస్తున్నారు చంద్రబాబు.
జరిగే పనేనా :
నిజానికి చంద్రబాబు ని కోర్టు గుమ్మం ఎక్కించడమే కష్టం. ఆయన్ని జైల్లో పెట్టించే ధైర్యం ఎవరికి ఉంది. అందుకే ఆయన అంత డేరింగ్ గా సవాల్ చేస్తున్నారు. బాబు మీద కేసులు ఉన్నాయి. వాటి మీద స్టేలు కూడా ఉన్నాయి. ఏళ్ళు గడచిపోతున్నా బాబుకు ఏమీ జరగడంలేదు. అందుకే జైలు అంటున్నారు బాబు. సరే జైలు వరకూ ఏమో కానీ బాబు మీద కేసు మాత్రం పెట్టారు విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు. ఇంతకీ కధ ఏంటి అంటే బాబు దళిత ఆఫీసర్ విజయకుమార్ మీద అనుచితమైన కామెంట్స్ ఈ మధ్య చేసారట.
కేసు నమోదు :
దళితులంటే బాబుకు చులకన అని, అది పదే అదే ఆయన రుజువు చేసుకుంటున్నారని కూడా గొల్ల బాబూరావు విమర్శిస్తున్నారు. దళితుడు అయిన విజయకుమార్ మీద నోరు పారెసుకున్నారని, అందుకు గానూ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నక్కపల్లి పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దాంతో చంద్రబాబు మీద కేసు నమోదు చేశారు. బాబుని ఇక్కడితో వదలమని, ఆయన మీద కోర్టుకు కూడా వెళ్తానని బాబూరావు అంటున్నారు.
జైలు సరదా తీర్చుకో :
మరో వైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్పీకర్ తమ్మినేని సీతారాం అయితే జైలు సరదా అంతుందా చంద్రబాబు అంటూ వెటకారం ఆడుతున్నారు. పదే పదే జైలుకు పోతానంటున్న బాబుకు తీహార్ జైలే బెస్ట్ అని కూడా సలహా ఇస్తున్నారు. పైగా తీహార్ జైలు ఇపుడు ఖాళీగా ఉందని, బాబు హాయిగా జైళ్ళో కావాల్సినన్ని రోజులు ఉండొచ్చని సెటైర్లు వేస్తున్నారు. బాబు ఏ జైలుకు పోయినా కూడా విశాఖ రాజధాని వచ్చి తీరడం ఖాయమని కూడా తమ్మినేని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. బాబు మీద కేసులు, కోర్టులు, స్టేలు, జైళ్ళు ఇవన్నీ కంచికి చేరేదెపుడో చూడాలి మరి.