Fri Dec 01 2023 15:32:36 GMT+0000 (Coordinated Universal Time)
కమలాపురంలోకి నో ఎంట్రీ
కమలాపురం మున్సిపల్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

కమలాపురం మున్సిపల్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు కమలాపురంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. పోలింగ్ రేపు జరగనుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బయట వ్యక్తులకు పోలీసులు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు.
పుత్తాను ఆపిన పోలీసులు
టీడీపీ ఇన్ ఛార్జి పుత్తా నరసింహారెడ్డిని పోలీసులు ఆపేశారు. దీనిపై ఆయన తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు కమలాపురంలో యధేచ్ఛగా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, తమ పార్టీ నేతలను అడ్డుకుంటున్నారని పుత్తా నరసింహారెడ్డి తెలిపారు.
Next Story