జాగ్రత్తగా తెలుగుదేశం గూటికి తెచ్చేస్తున్నారే ?
పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. అంటే ఆయన ఒకరి డైరెక్షన్ లో నటిస్తారు. అయితే రాజకీయాల్లో కూడా పవన్ ని అలా డైరెక్ట్ చేయాలన్న ఆశలు [more]
పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. అంటే ఆయన ఒకరి డైరెక్షన్ లో నటిస్తారు. అయితే రాజకీయాల్లో కూడా పవన్ ని అలా డైరెక్ట్ చేయాలన్న ఆశలు [more]

పవన్ కళ్యాణ్ ముందు సినీ నటుడు. అంటే ఆయన ఒకరి డైరెక్షన్ లో నటిస్తారు. అయితే రాజకీయాల్లో కూడా పవన్ ని అలా డైరెక్ట్ చేయాలన్న ఆశలు చాలా మందికి ఉన్నాయి. కొందరు ఇప్పటికే చేశారు కూడా. దానికి పవన్ అవగాహనా రాహిత్యం అనుభవం లేకపోవడం కూడా దోహదపడ్డాయి. పవన్ కళ్యాణ్ ఏడాది క్రితం అర్జెంట్ గా కమలదళంతో దోస్తీ ఎందుకు కట్టారు అంటే దానికి తెర వెనక చంద్రబాబు ఉన్నారు అని ప్రచారంలో ఉంది. ఇపుడు సడెన్ గా బీజేపీతో బంధం తెంచుకోవాలని కూడా డిమాండ్లు వస్తున్నాయి. దాని వెనక ఎవరు ఉన్నారూ అంటే మళ్లీ చంద్రబాబు పేరే వినిపిస్తోంది.
డైరెక్టర్ గా ఆయనే….?
ఆ విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని నిర్దేశిస్తున్నది, డైరెక్ట్ చేస్తున్నది చంద్రబాబేనని వైసీపీ నేతలు విమర్శిస్తారు. పవన్ సైతం చంద్రబాబు మీద ఇప్పటికీ గట్టిగా మాట్లాడిన దాఖలాలు లేకపోవడం కూడా దానికి ఆధారంగా ఉంది. ఇక బీజేపీ మీద పవన్ కళ్యాణ్ కి కోపం ఉందా అంటే ఆయన తెలంగాణాలో ఆ పార్టీ నేతల మీద చేసిన హాట్ కామెంట్స్ ని పరిగణలోకి తీసుకుని ఏపీలోనూ ఈ బంధం తెగిపోతుంది అని చూపిస్తున్నారు. నిజానికి ఏపీలో బీజేపీ కంటే పవన్ కళ్యాణ్ దే పెద్ద పార్టీ. కానీ బీజేపీ జాతీయ స్థాయిలో పెద్ద పార్టీ కాబట్టి ఏపీలో కూడా పెద్దన్న పాత్ర పోషిస్తోంది. అది పవన్ కి మండుకొస్తోంది అంటున్నారు. దాంతో ఆయన ఎపుడైనా బీజేపీకి టాటా కొడతారు అన్న చర్చ అయితే ఉంది.
రావద్దుట …
ఇక తిరుపతి లో ఉప ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ రావద్దు అని టీడీపీ నేతలు పరోక్షంగా సూచిస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి అయితే పవన్ కళ్యాణ్ ని అకాశానికి ఎత్తేస్తున్నారు. పవన్ సహకారం లేకపోతే బీజేపీ బండారం ఏంటో జాతీయ స్థాయిలో అందరికీ తెలుస్తుంది అని కూడా అంటున్నారు. అంటే బీజేపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ జనాల్లోకి వస్తే అది కచ్చితంగా తెలుగుదేశం ప్రయోజనాలనే దెబ్బ తీస్తుంది అన్న విశ్లేషణ ఉంది. పవన్ ప్రచారంతో ఆయన్ని అభిమానించే వారంతా బీజేపీకి ఓటు చేస్తే ఆ మేరకు ఓట్లు చీలి వైసీపీ మెజారిటీ దారుణంగా పెరుగుతుంది, టీడీపీ పరువు గంగలో కలుస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ ని ప్రచారానికి రావద్దు అని టీడీపీతో పాటు ఆ పార్టీ కొత్త మిత్రపక్షం సీపీఐ కూడా కోరుతోంది.
ఒక్క దెబ్బకు….
ఇక పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకపోతే బీజేపీకి గతంలో వచ్చిన 16 వేల ఓట్లు కంటే కొద్దో గొప్పో వచ్చి ఊరుకుంటాయి. టీడీపీ వైసీపీకి ధీటు అయిన పోటీ ఇస్తుంది. జనసేన అభిమానులు కార్యకర్తలు కూడా బీజేపీని పక్కన పెట్టి టీడీపీ వైపు మళ్ళుతారు. ఎందుకంటే వారికి తిరుపతి సీటు తమకు ఇవ్వలేదు అన్న కోపం బీజేపీ మీద ఎటూ ఉంది. ఈ రకమైన రాజకీయ వ్యూహాన్ని చంద్రబాబు రచించే తన పార్టీ మనుషుల ద్వారా పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకుండా చూడాలనుకుంటున్నారని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ తీరు చూస్తే ప్రచారానికి వస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆయన కనుక రాకపోతే తిరుపతి పోరులో టీడీపీ గట్టిపడుతుంది. వైసీపీకి టఫ్ ఫైట్ ఇస్తుంది. ఆ పార్టీ మెజారిటీ కూడా పెరిగే చాన్స్ లేదు అంటున్నారు. మరి ఈ లెక్కలు పవన్ కళ్యాణ్‌కి కూడా చేరవేసే ఉంటారు కాబట్టి ఆయన నిర్ణయం ఇపుడు ఆసక్తికరమే.

