జగన్ సర్కార్ కు టైం ఫిక్స్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇకపై జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వైెఎస్ జగన్ తొమ్మిదేళ్ల పాటు జనంలోనే ఉండి ముఖ్యమంత్రి అయ్యారు. అదే [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇకపై జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వైెఎస్ జగన్ తొమ్మిదేళ్ల పాటు జనంలోనే ఉండి ముఖ్యమంత్రి అయ్యారు. అదే [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇకపై జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. వైెఎస్ జగన్ తొమ్మిదేళ్ల పాటు జనంలోనే ఉండి ముఖ్యమంత్రి అయ్యారు. అదే స్ఫూర్తితో పవన్ కల్యాణ్ కూడా జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుంది. అయితే పాదయాత్రల వంటి వాటికి జోలికి పోకుండా నిత్యం కార్యకర్తలతో సమావేశమవ్వాలన్నది పవన్ కల్యాణ్ ఆలోచనగా కన్పిస్తుంది. ప్రతి మండల కేంద్రానికి వెళ్లి కార్యకర్తలను కలిసేందుకు పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నారు.
బలమైన నేతలను….
ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో దీనిపై పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాల్లో పవన్ కల్యాణ్ పాల్గొంటున్నారు. ఈ సమీక్షల్లోనే పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా లేదన్న విషయాన్ని గుర్తించారు. బలమైన నేతలు లేనందువల్లే ఓటమి పాలయ్యామని పవన్ కల్యాణ్ గ్రహించారు. అందుకే బలమైన నేతలను తానే తయారు చేసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
జిల్లా పర్యటనలతో…..
అక్టోబరు నెల నుంచి పవన్ కల్యాణ్ జిల్లా పర్యటనలు ఉండనున్నాయి. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పవన్ ఫోకస్ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నిర్మాణంపై ఆయన దృష్టి పెట్టనున్నారు. పార్టీ నూతన కమిటీలను ఇప్పటికే పవన్ కల్యాణ్ ఏర్పాటు చేశారు. ఇక బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలను నియమించేందుకు పవన్ రెడీ అవుతున్నారు. జిల్లా, మండల, గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ నేతలను ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ ఛార్జిల నియామకాన్ని కూడా పూర్తి చేయనున్నారు.
అక్టోబరు వరకూ సమయం…..
ఇక ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే కావడంతో మరికొంత సమయం ప్రభుత్వానికి ఇవ్వాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకే అక్టోబరు వరకూ ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్లు ఆయన సమావేశాల్లో చెబుతున్నారు. ప్రజాసమస్యలపై అక్టోబరు నుంచి ఆందోళనకు దిగుతూ, మరోవైపు కార్యకర్తల సమావేశాల్లో పాల్గొనేలా పవన్ కల్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరి పవన్ కల్యాణ్ కు అంత ఓపిక ఉందా? ఆయన జనంలో ఏళ్లతరబడి ఉండగలరా? అన్నది ప్రశ్న.