వకీల్ సాబ్ పొలిటికల్ స్టామినా ఎంత ?
వకీల్ సాబ్ సూపర్ డూపర్ హిట్ అయింది. సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తరువాత చేసిన సినిమా ఇది. పైగా పవన్ కల్యాణ్ సినిమాలకు [more]
వకీల్ సాబ్ సూపర్ డూపర్ హిట్ అయింది. సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తరువాత చేసిన సినిమా ఇది. పైగా పవన్ కల్యాణ్ సినిమాలకు [more]

వకీల్ సాబ్ సూపర్ డూపర్ హిట్ అయింది. సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తరువాత చేసిన సినిమా ఇది. పైగా పవన్ కల్యాణ్ సినిమాలకు దూరం అని చెప్పడంతో నాడు ఫ్యాన్స్ అంతా తెగ కలవరపడ్డారు. అలాంటి పవన్ మళ్లీ ముఖానికి రంగు వేసుకోవడమే ఘనం అనుకుంటే ఆయన ఇమేజ్ కి తగిన స్టోరీ వకీల్ సాబ్ తో పడడంతో స్క్రీన్ మీద రెచ్చిపోఅయడనే చెప్పాలి. ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆకలిని పూర్తిగా తీర్చే సినిమాగా దీన్ని చూస్తున్నారు. దాంతో బాక్సాఫీస్ రికార్డులు ఒక్కోటీ బద్ధలు అవుతున్నాయి.
రేంజి తగ్గలా..?
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పవన్ కల్యాణ్ సినిమాల్లో ఎపుడు తగ్గాడని. ఆయన ఫ్లాప్ సినిమా కాటమరాయుడు కూడా అరవై కోట్ల దాకా వసూల్ చేసి ఒక మీడియం స్థాయి హీరో సూపర్ హిట్ సినిమా రేంజిలో నిలబడింది. ఇక పవన్ కల్యాణ్ శ్రద్ధ పెట్టి సినిమాలు చేయలే కానీ నిర్మాతలకు దర్శకులకూ ఎపుడూ కొదవలేదు. పవన్ మార్కెట్ మూడేళ్ల తరువాత కూడా నంబర్ వన్ లోనే ఉందని వకీల్ సాబ్ ద్వారా రుజువు అయింది. టాలీవుడ్ లో ఇపుడు పక్కా మాస్ హీరోలెవరికీ అందరి స్థాయి పవన్ కి ఉంది. దాంతో ఆయన సినిమాలు కలెక్షన్ల విషయంలో ఎవరికీ రెండవ అభిప్రాయం లేదు మరి.
కన్వర్ట్ అయ్యేదెలా..?
పవన్ కల్యాణ్ కి విపరీతమైన సినిమా గ్లామర్ ఉంది. దాంతో ఆయన సినిమాలకు రికార్డులు అలవోకగా బద్ధలు అవుతున్నాయి. మరి ఇంత గ్లామర్ ఉండి కూడా రాజకీయ తెర మీద మాత్రం ఎందుకు ఫ్లాప్ టాక్ వస్తోంది అన్నది ఒక్కడ ప్రధామైన ప్రశ్న. అయితే రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అన్నదే ఇక్కడ చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ సినిమా హీరోగానే ఇప్పటికీ ఫ్యాన్స్ అభిమానిస్తున్నారు అన్న సందేశాన్ని వకీల్ సాబ్ రుజువు చేసింది. ఈ మూవీని సూపర్ హిట్ చేయడం ద్వారా జనాలు పవన్ కల్యాణ్ ని తాము స్టార్ హీరోగానే వెండి తెర మీద మరిన్నాళ్ళు అలరించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పేశారు. అదే సమయంలో సినిమా టికెట్లు తెగినంత మాత్రాన రాజకీయ సినిమా కూడా హిట్ అవుతుందని కూడా ఎవరూ చెప్పలేరు. దానికి ఎన్నో ఉదాహరణలు కళ్ల ముందే ఉన్నాయి. ఇక్కడ ఉన్న అఖండమైన ప్రజాదరణ అక్కడ ఓట్ల రూపంలో మారుతుందని కూడా ఎవరూ కచ్చితంగా చెప్పలేరు.
జనం జడ్జిమెంట్…
కానీ పవన్ కల్యాణ్ మాత్రం రెండు పడవల మీద కళ్ళు పెట్టి ఉన్నారు. ఆయన అవతల జనసేనాని రోల్ లో కూడా ఉన్నారు. అయితే వరసపెట్టి సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ సమయంలో కమ్ బ్యాక్ సినిమా వకీల్ సాబ్ ఇచ్చిన ఊపుతో పవన్ కల్యాణ్ ఇంకా జోష్ మీద సినిమాలు చేస్తాడు అన్న వారూ ఉన్నారు. వకీల్ సాబ్ బాగానే వాదించాడు. ఆయన నటన అదిరిపోయింది. పవన్ హ్యాపీగా ఇలాగే సినిమాలు చేస్తూ తమను ఆనందపరచాలని సగటు పవన్ కల్యాణ్ అభిమాని తీర్పు చెప్పేశాడు అంటే అందులో తప్పేమీ లేదు. సినిమా హీరో కావడమే ఒక లక్. అందునా టాప్ రేంజి హీరోగా ఉంటూ టాలీవుడ్ మార్కెట్ ని శాసించడం అంటే ఇంకా గ్రేట్. కానీ పవన్ మాత్రం పూర్తిగా సినిమాలలో కొనసాగుతారా అన్న డౌట్లు ఇప్పటికీ ఉన్నాయి. జనాల జడ్జిమెంట్ మాత్రం పవన్ సినీ హీరోగా మరింతకాలం అలరించాలనే. ఏం జరుగుతునో చూడాలి మరి.

