పనబాక అసలు విషయం బాబుకు చెప్పేశారా?
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల దెబ్బకు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే చెబుతున్నారు. వరసగా రెండు ఎన్నికల్లో ఓటమి [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల దెబ్బకు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే చెబుతున్నారు. వరసగా రెండు ఎన్నికల్లో ఓటమి [more]

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల దెబ్బకు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే చెబుతున్నారు. వరసగా రెండు ఎన్నికల్లో ఓటమి పాలు కావడం, పార్టీ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో రాజకీయాల నుంచి వైదొలగడమే బెటర్ అని పనబాక లక్ష్మి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేమని వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
తొలుత నిరాకరించినా…?
ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మి పోటీ చేసేందుకు తొలుత నిరాకరించారు. అయితే చంద్రబాబు వత్తిడి చేసి ఆమెను పోటీకి దింపారు. ఫలితం ముందుగానే తెలిసిపోతుండటంతో పనబాక లక్ష్మి తొలినుంచి యాక్టివ్ గా లేరు. మూడు నెలల ముందు అభ్యర్థిగా ప్రకటించినా పనబాక లక్ష్మి పెద్దగా యాక్టివ్ గా లేరు. అందరికంటే ముందు ప్రచారాన్ని ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించినా ఆమె నిరాసక్తత కనపర్చారు.
స్థానిక నాయకత్వంపై….
ఇక తిరుపత ఉప ఎన్నికల సందర్భంగా పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయలేదని పనబాక లక్ష్మి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయి నేతలు పనిచేసినప్పటికీ నియోజకవర్గాల్లో టీడీపీ బాధ్యులు పార్టీ ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా ఖర్చు చేయలేదని ఆమె చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో కూడా స్థానిక నాయకత్వం అశ్రద్ధ చూపెట్టారని పనబాక లక్ష్మి చెప్పినట్లు సమాచారం.
పార్టీ ఇచ్చిన నిధులు కూడా….
ఇంత దారుణ ఓటమిని చవి చూస్తానని తాను అనుకోలేదని పనబాక లక్ష్మి చెప్పారు. చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు వంటి నేతలు తన విజయం కోసం శ్రమించినప్పటికీ స్థానిక నాయకత్వంపై పనబాక లక్ష్మి ఆగ్రహంగా ఉన్నారు. అందువల్లనే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఆమె చంద్రబాబుతో చెప్పినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు మాత్రం గెలుపోటములు సహజమేనని, పునరాలోచించుకోవాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

