జగన్ కు నిమ్మగడ్డ రివర్స్ ఝలక్… శుక్రవారం అందుకేనా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు జరపాలన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే పని చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు జరపాలన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే పని చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు జరపాలన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే పని చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేయనుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే ఇప్పుడు ఎపి లో హాట్ టాపిక్ గా మారింది. హై కోర్ట్ ఆదేశాల మేరకు సీఎస్ నేతృత్వంలో అధికారుల బృందం సీఈసీ తో భేటీ కావడం ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా లేదని సర్కార్ మనోగతం తేల్చి చెప్పడం తెలిసిందే. యుకె స్ట్రెయిన్ విజృంభించే అవకాశం ఉందని ఆ కేసులు ఎపి లో కూడా ఉన్నట్లు అధికారుల బృందం పేర్కొంది. సీఎస్ కలిసిన నిమిషాల్లోనే సీఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేయడం ఆసక్తికరం కానుంది.
కోర్టుకు సెలవులు……
నిమ్మగడ్డ రమేష్ కుమార్ చాలా తెలివిగా శుక్రవారం రాత్రి షెడ్యూల్ విడుదల చేశారు. శనివారం నుంచి హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం హైకోర్టు కు వెళ్లే అవకాశం లేదంటున్నారు. అయితే స్పెషల్ లీవ్ పిటీషన్ ను ప్రభుత్వం దాఖలు చేసే అవకాశముంది. దీనిపై ప్రభుత్వం న్యాయనిపుణులతో చర్చలు జరుపుతోంది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఉందని చెప్పినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా షెడ్యూల్ విడుదల చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వం సిద్ధపడుతుందా?
స్థానిక ఎన్నికలను ఏప్రిల్ లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఇప్పటికే ఎన్నికలు ఎప్పుడు అన్న అంశంపై ఎంపి విజయసాయి రెడ్డి ఇప్పటికే ప్రకటించేయడం విశేషం. సీఈసీ ని అధికారుల బృందం కలవకముందే సాయి రెడ్డి ఈ ప్రకటన చేయడం గమనార్హం. దీనిని బట్టి తాము ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే ఎన్నికలు అన్న సంగతిని చెప్పక చెప్పింది ప్రభుత్వం. వాస్తవానికి ఈ ప్రకటన చేయాలిసిన అవసరం ఆయనకు లేకపోయినా రాజకీయ వ్యూహం తో పాటు ప్రధాన ప్రతిపక్షాన్ని మరింత కవ్వించేందుకు సీఈసీ కి సవాల్ విసిరేందుకు మాత్రమే అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది.
ఏకపక్షంగా ఇచ్చారంటూ….
దీనికి ప్రతి సవాల్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయినట్లే. ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఇష్టపడటం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించారని ప్రభుత్వం అభిప్రాయపడింది. మరోసారి ఎన్నికల కమిషన్ కు, ప్రభుత్వానికి మధ్య వార్ ప్రారంభమయినట్లే. చూడాలి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఏరకంగా స్పందిస్తుందో?