ఈయన నుంచి అంతకంటే ఏం ఆశిస్తాం?
స్థానిక సంస్థల ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాదాపుగా సిద్ధమయిపోయారు. ఆయన ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరలో విడుదల చేసే అవకాశముంది. అయితే గతంలో జరిగిన ఏకగ్రీవాలపై [more]
స్థానిక సంస్థల ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాదాపుగా సిద్ధమయిపోయారు. ఆయన ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరలో విడుదల చేసే అవకాశముంది. అయితే గతంలో జరిగిన ఏకగ్రీవాలపై [more]

స్థానిక సంస్థల ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాదాపుగా సిద్ధమయిపోయారు. ఆయన ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరలో విడుదల చేసే అవకాశముంది. అయితే గతంలో జరిగిన ఏకగ్రీవాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 2,450 వరకూ ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే జడ్పీటీసీలు కూడా అధిక సంఖ్యలోనే ఏకగ్రీవం అయ్యాయి.
ఏకగ్రీవాలు రద్దే….
ఏకగ్రీవం అయిన స్థానాలన్నీ అధికార వైసీపీకి దక్కాయి. అయితే ఇప్పుడు అన్ని స్థానాలకూ షెడ్యూల్ ను విడుదల చేయాలని, ఏకగ్రీవాలను రద్దు చేయాలని విపక్ష పార్టీలు కోరుతున్నాయి. అధికార పార్టీ వత్తిడి తెచ్చి ఏకగ్రీవాలను చేసుకుందని, వాటిని రద్దు చేయాలని వైసీపీ తప్ప దాదాపు అన్ని పార్టీలూ ఎన్నికల కమిషన్ ఫ్రెష్ షెడ్యూల్ ను విడుదల చేయాలని కోరుతున్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఫ్రెష్ షెడ్యూల్ తో……
కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా ఉండటంతో ఫ్రెష్ గా మళ్లీ షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. తనకు భద్రతను కల్పించాలని కోరడంతో పాటుగా ఏకపక్షంగా ఏకగ్రీవాలు అయ్యాయని, అధికార పార్టీ అరాచకాలకు పాల్పడిందని కూడా నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
తాను రాసిన లేఖలోనే…..
గతంలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలను, ఇప్పుడు జరిగిన ఏకగ్రీవాల విషయాన్ని కూడా నిమ్మగడ్డ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. అధికార పార్టీ వత్తిడి వల్లనే ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయని నిమ్మగడ్డ హోంశాఖకు రాసిన లేఖలో తన అభిప్రాయాన్ని ఎప్పుడో కుండబద్దలు కొట్టేశారు. ఇప్పుడు కొత్తగా ఆయన తీసుకునే నిర్ణయం పై ఎలాంటి ఉత్కంఠ ఉండదు. ఆయన ఏకగ్రీవాలను రద్దు చేసేందుకే మొగ్గు చూపుతారు. మరోవైపు నోటిఫికేషన్ విడుదల చేసి ఆరు నెలలయినందున అది చెల్లదని కూడా నిపుణులు అంటున్నారు.

