నిమ్మగడ్డపై నిర్ణయం ఎలా ఉంటుందో?
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎల్లుండి గవర్నర్ ను కలవబోతున్నారు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎల్లుండి గవర్నర్ ను కలవబోతున్నారు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా [more]

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎల్లుండి గవర్నర్ ను కలవబోతున్నారు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కనగరాజ్ ను కూడా నియమించింది. ప్రత్యేక ఉత్తర్వులు, సవరణల ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో కనగరాజ్ ను నియమించింది. ఆయన గవర్నర్ వద్దకు వెళ్లి మరీ కలసి బాధ్యతలను స్వీకరించారు.
హైకోర్టును ఆశ్రయించి…..
అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనను తొలగించడంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు ప్రకారం కనగరాజ్ నియామకం చెల్లదని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇంకా పదవి కాలం ఉన్నందున ఈ ఉత్తర్వులు చెల్లవని హైకోర్టు తీర్పు చెప్పింది. అంటే పరోక్షంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా కొనసాగించాల్సిందేనని హైకోర్టు తీర్పు సారాంశం.
సుప్రీంకోర్టులో కూడా….
కానీ హైకోర్టు తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని అభ్యర్థించింది. ఇందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. వాదనలను వింటామని విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. దీంతో మారోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనను గవర్నర్ ను కలవాలని ఆదేశించింది. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎల్లుండి గవర్నర్ ను కలవనున్నారు.
గవర్నర్ వద్దకు పంచాయతీ….
అయితే గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేటికీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నట్లే. టెక్నికల్ గా ఆయన పదవి నుంచి దిగిపోలేదు. దీంతో గవర్నర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సానుకూలంగానే నిర్ణయం తీసుకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంత రగడ అయిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా బాధ్యతలను స్వీకరించి ఏం బావుకుందామన్నదే ఇప్పుడు ప్రశ్న.

