నిమ్మగడ్డ పెద్ద తప్పు చేశారా?
ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్లు స్పష్టమయింది. అయితే ఆయన ఎన్నికల అధికారిగా తనకు భద్రత కల్పించమనడంలో ఏమాత్రం తప్పులేదు. ముఖ్యమంత్రి [more]
ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్లు స్పష్టమయింది. అయితే ఆయన ఎన్నికల అధికారిగా తనకు భద్రత కల్పించమనడంలో ఏమాత్రం తప్పులేదు. ముఖ్యమంత్రి [more]

ఆ లేఖ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్లు స్పష్టమయింది. అయితే ఆయన ఎన్నికల అధికారిగా తనకు భద్రత కల్పించమనడంలో ఏమాత్రం తప్పులేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ తనపై వ్యక్తిగత విమర్శలకు దిగడంతో పార్టీ క్యాడర్ నుంచి తనకు ముప్పు ఉందని ఆయన భావించవచ్చు. అయితే ఆయన భద్రత వరకూ ఆ లేఖలో ప్రస్తావస్తే సరిపోయేది. కానీ అనేక రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించడం వివాదాస్పదమయింది.
ఈ లేఖ కూడా….
తొలి నుంచి వైసీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ చెబుతున్నట్లుగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలకు తగినట్లుగానే ఈ లేఖ ఉండటం విశేషం. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు చివరకు స్పీకర్ కూడా తనపై తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారని, కిందిస్థాయి నేతల గురించి చెప్పాల్సిన పనిలేదన్నారు. అయితే తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఉండటమే మంచినదని భావిస్తున్నానన్నారు. అంతేకాదు హైదరాబాద్ లో కూడా తనకు పూర్తి భద్రత దొరుకుతుందని తాను భావించడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. తానంటే పడని వారకి హైదరాబాద్ లోనూ విస్తృత పలుకుబడి ఉందని పరోక్షంగా జగన్ పార్టీ గురించి ఆయన ప్రస్తావించారు.
ఫ్యాక్షన్ ముద్ర వేసి…..
ఇక మరో విషయమేంటంటే జగన్ పార్టీపై పరోక్షంగా నిమ్మగడ్డ రమేష్ ఫ్యాక్షన్ ముద్ర కూడా వేశారు. ఫ్యాక్షన్ తో కూడిన నేపథ్యం, కక్ష సాధింపు చర్యలను దృష్టిలో ఉంచుకునే తాను హైదరాబాద్ లో ఉండేందుకు నిర్ణయించుకున్నానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. తన పట్ల అసహనంగా ఉన్న వారికి అధికారంతో పాటు వనరులు, నేరముఠాలు కూడా ఉన్నాయని తీవ్ర కామెంట్స్ చేశారు. గతలో వారి కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంటే జగన్ పార్టీ నేతలు నేర ముఠాలుగా ఆయన పరోక్షంగా చెప్పేశారు.
రాజకీయ ఆరోపణలను….
దీంతో పాటు గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలను కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. 2014లో ఎంపీటీసీ స్థానాలు కేవలం 2శాతం ఏకగ్రీవమయితే ఇప్పుడు 24 శాతం ఏకగ్రీవమయ్యాయన్నారు. 1096 జడ్పీటీసీ స్థానాల్లో అప్పుడు ఒకే ఒక స్థానం ఏకగ్రీవం అయితే ఇప్పుడు 652 స్థానాలకు 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. కడపలో 79శాతం ఎంపీటీసీలు, 38శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయని కడప గురించి ప్రత్యేకంగా లేఖలో ప్రస్తావించారు. ఇలా ఎన్నికల అధికారిగా కాకుండా ప్రస్తుతమున్న ప్రభుత్వంపై ఫ్యాక్షన్ ముద్ర వేయడమే కాకుండా, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవన్న విషయాన్ని కేంద్రానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టంగా తెలిపారు. ఇలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ తన భద్రత వరకూ పరిమితమయి ఉంటే బాగుండేది. అలా కాకుండా ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేస్తూ ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆయనే రాసినట్లు కేంద్ర హోంశాఖ ధృవీకరించడంతో ఆయన పెద్ద తప్పు చేశారని రాజకీయవర్గాలు సయితం అభిప్రాయపడుతున్నాయి.

